AAI 368 Posts Recruitment 2020 Airport Authority of India Recruitment 2020. Airports Authority of India invites applications from eligible candidates to apply ON-LINE through AAI’s Website www.aai.aero for RECRUITMENT OF MANAGERS AND JUNIOR EXECUTIVES IN VARIOUS DISCIPLINES. No application through any other mode will be accepted.Official Website is https://www.aai.aero/en/careers/recruitment

AAI 368 Posts Recruitment 2020 Airport Authority of India Recruitment 2020

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూ టివ్ పోస్టుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 368 ఖాళీలు. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

మొత్తం ఖాళీలు 368
పోస్టుల వివరాలు 

మేనేజర్ (ఫైర్ సర్వీసెస్): మొత్తం 11 పోస్టులు ఉన్నాయి.
60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్/మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.

మేనేజర్(టెక్నికల్): మొత్తం 2 పోస్టులు ఉన్నాయి.
60 శాతం మార్కులతో బీఈ/బీటె క్(మెకానికల్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సంబం ధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్): మొత్తం 264 ఖాళీలు ఉన్నాయి.
60 శాతం మార్కులతో ఫిజిక్స్, మేడ్తో బీఎస్సీ/ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. ఈ పోస్టుకు వాయిస్ టెస్ట్ ఉంటుంది. కనుక అభ్యర్థికి ఇంగీష్ మాట్లాడం, రాయడం వచ్చి ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్): 83 పోస్టులు ఉన్నాయి.
60 శాతం మార్కు లతో సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషతో పాటు ఎంబీఏ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉం డాలి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. .

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్): మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. 60 శాతం మార్కులతో బీఈ/బీ టెక్(మెకానికల్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత

వయసు
2020 నవంబరు 30 నాటికి మేనేజర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కు గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు. రిజర్వ్డ్ ఆభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

వేతన శ్రేణి : మేనేజర్: రూ.60,000 - 1,80,000 జూనియర్ ఎగ్జిక్యూటివ్: రూ.40,000 - 1,40,000
ఎంపిక

  • ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత పరీక్షలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి ప్రక్రియకు అనుమతిస్తారు. పోస్టు ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేష స్/ఇంటర్వ్యూ / ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్/ వాయిస్ టెస్టు ఉంటాయి.
  • ఆ అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధా రంగా షార్ట్ లిస్ట్ చేసి తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివ రాలను అధికారిక వెబ్ సైట్లో పొందుప రుస్తారు లేదా అభ్యర్థి రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి కాల్ లెటర్ పంపుతారు

దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 15
చివరి తేదీ: 2021 జనవరి 14

దరఖాస్తు ఫీజు: రూ.1000(ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు రూ.170). ఏఏఐ అప్రెంటిస్(ఏడాది) పూర్తి చేసినవారు, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ పరీక్ష తేదీ: తరవాత ప్రకటిస్తారు
వెబ్ సైట్: https://www.aai.aero

Previous Post Next Post