NMMS SCHOLARSHIP APPLICATION DETAILS 2020
పేద విద్యార్థులకు మంచి అవకాశం
పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దీని వల్ల తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్లు పాటు వరుసగా (ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు) రూ.12,000 ఉపకార వేతనం అందుతుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, ట్రెబల్ పాఠశాలలు, ఏపీఆర్ఎస్, ఏపీడబ్ల్యూఆర్ఎస్, కేజీబీవీపీ, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థు లకు మాత్రం ఈ పరీక్ష రాయడానికి అవకాశం లేదు."ఈ స్కాలర్షిప్ పొందినవారు పదో తరగతి అనంతరం ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ కాలేజీలలో మాత్రమే చద వాలి. అలా అయితేనే ఇంటర్మీడియట్ లో స్కాలర్షిప్ కొనసాగుతుంది. ప్రస్తుతం వారు చదువుతున్న కాలేజీ లోనే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే పదో తరగతితో ఆగిపోతుంది. గడువులోగా ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్న వారిలో అరులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
-బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో
ఈ ఏడాది ఆరో తరగతి మార్కులే.. ప్రతీ సంవత్సరం ఏడో తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణన లోకి తీసుకుని విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసేవారు.
అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా వార్షిక పరీక్షలు నిర్వ హించకపోవడంతో ఆరో తరగతిలో వారు సాధించిన మార్కులను ప్రామా ణికంగా తీసుకోనున్నారు. ఆరో తరగతి పరీక్షల్లో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.