The Indian Coast Guard, an Armed Force of the Union, offers a challenging career to young and dynamic Indian male candidates for General Duty branch as an Assistant Commandant (Group ‘A’ Gazetted Officer) and invites ‘online’ application for SC, ST and OBC category only.25 Asst Commandant Indian Coast Guard 2020 Recruitment Notification
25 Asst Commandant Indian Coast Guard 2020 Recruitment Notification
ఉత్సాహవంతులైన గ్రాడ్యుయేట్ల కోసం భారతీయ తీరదళం ఎదురు చూస్తోంది. పురుషుల నుంచి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు సొంతం చేసుకోవచ్చు. వీరికి ఉద్యోగం, బాధ్యతలు, వేతనం.. అన్నీ ఉన్నతస్థాయిలో ఉంటాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ , మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్) జనరల్ డ్యూటీ (పురుషులు)
అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండడం తప్పనిసరి. అలాగే వీటిలోనూ 60 శాతం మార్కులు ఉండాలి.
వయసు: అభ్యర్థులు జులై 1, 1996 - జూన్ 30, 2000 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండు తేదీలనూ పరిగణనలోకి తీసుకుం టారు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయ సులో సడలింపులు వర్తిస్తాయి. అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి.
జనరల్ డ్యూటీ విభాగంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఖాళీలు: 25. వీటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 14, ఓబీసీలకు 6 కేటాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21. 12. 2020
చివరితేదీ: 27.12.2020
ప్రవేశపత్రాలు: జనవరి 6 నుంచి 10 వరకు కోస్టుగార్డు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీ: స్టేజ్-1 ప్రాథమిక పరీక్షలు జనవరి 10, 2021 - ఫిబ్రవరి 10, 2021 లోగా ఎప్పుడైనా ఉండవచ్చు.
అకడమిక్ మెరిట్ ఆధారంగా తగిన అర్హతలు ఉన్నవారికి స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపికలో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు (పీపీ అండ్ డీటీ) ఉంటాయి. ఆప్టిట్యూడ్ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్ డీటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి.
స్టేజ్ -1లో ఎంపికైనవారికి స్టేజ్-2 నిర్వహి స్తారు. ఇందులో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్ ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్-2లోనూ ఎంపికైనవారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు మే, 2021లో కోస్టు గార్డు వెబ్ సైట్లో ప్రకటిస్తారు.
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారిని అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ. 56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెల్తప్, ఇతర అలవెన్సులు ఉంటాయి. వీరు తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలు పొందవచ్చు. భారత సముద్రతీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విది.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, చెన్నై, కోల్‌కతా, నోయిడా,
వెబ్ సైట్: www.joinindiancoastguard.gov.in