855 Anganwadi Posts Recruitment 2020 Notification - Anganwadi Workers, Anganwadi Helpers in Anantapuram District
అనంతపురము జిల్లాలోని 17 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2020 అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణత ప్రోఫోర్మలో ప్రకటన వెలువడిన తేది నుండి 10 రోజులలోగా అరులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును
అనంతపురంలో 855 అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ వివాహిత మహిళల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా - జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన నోటిఫికేషన్ నెంబర్ 233226/ తేది 11.12.2020
మొత్తం ఖాళీలు: 855 పోస్టులు ఖాళీలు: అంగన్వాడీ హెల్బర్-658, అంగన్వాడీ వర్కర్-182, మినీ అంగన్వాడీ వర్కర్-67
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.. అంగన్వాడీ ఉన్న గ్రామం పరిధిలో స్థానికులు అయి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులు పోస్టూల కొరకు దరఖాస్తు చేసుకోను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
అభ్యర్థుల వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండవలెను.
వయసు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్, చిరునామా: సీడీపీఓ కార్యాలయం, అనంతపురం. దరఖాస్తుకు చివరి తేది: 19.12.2020. 01.07.2020 నాటికి దరఖాస్తులు అభ్యర్థుల వయసు 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాలు లోపల వారు అయియుండవలెను. 2019 సంవత్సరములో ఇచ్చిన నోటిఫికేషన్ లకు అర్జీలు దాఖలు చేసిన అభ్యర్థులకు మాత్రమే 01.07 ..2019 నాటికి వయసు 35 సంవత్సరాలు లోపు వారు ఉండవలెను SC మరియు ST ప్రాంతములో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరాములు నిండిని వారు కుడా అర్హులు
అంగన్వాడీ కార్యకర్త మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులు పోస్టలలో నియమకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును. ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతన రూ:11500/- నెలకు, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతన రూ:7000/- నెలకు మరియు అంగన్వా డి సహాయకులు గౌరవ వేతన రూ:7000/- నెలకు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం చెల్లించబడును. రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్ట్ కార్యాలయముల యందు మరియు గ్రామ సచివాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచడమైనది.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధర్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గాజిట్టేడ్ అధికారిచే దృవికరణ చేసినవి జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే , తప్పనిసరిగా టి.సి/ స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్రుటిని సమయములో CDPO ఎటువంటి అవకతవకలును అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును. . దరఖాస్తు లో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును. మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ anantapuramu.ap.gov.in లో చూడవచ్చు. మరియు దరఖాస్తులు మెయిల్ ద్వారా సంబంధిత సి.డి.పి.ఓలకు పంపవలెను. మరియు దరఖాస్తులను స్వయముగా సంబంధిత సి.డి.పి .ఓ కార్యాలయము నందు సమర్పించవలెను.
వెబ్ సైట్: https://ananthapuramu.ap.gov.in