అడవికి రారాజు సింహం. అడవిలో ఏ జంతువునైనా సింహం తన పంజా, గర్జనతో భయపెడుతుంది. కావున దానితో పోరాడటం ఏ జంతువు వల్ల కాదు.. 
బలవంతుడ్ని చూసి భయపడాల్సిన బలహీనుడు తిరగబడితే ఎలా ఉంటుంది?... గెలుపు ఎవరిదన్న సంగతి పక్కన పెడితే.. ఓ చిన్న ప్రయత్నం.. పోయేదేముంది. చరిత్రలో మిగిలిపోతాము లేదా మనమేం పిరికివాళ్లం కాదని లోకానికి చాటి చెబుతాం. 
ఉద్దేశ్యం వేరైనా ఓ కుక్క ఏకంగా సివంగితోనే కయ్యానికి కాలు దువ్వింది. దాని దెబ్బలకు ఎదురొడ్డి కొద్దిసేపు తలపడింది. కానీ, సివంగి బలం ముందు తన బలం ఎందుకూ కొరగాదన్న సత్యం తెలుసుకుని కాళ్లకు బుద్ధి చెప్పింది. అలా కాకుండా మొండి ధైర్యంతో ముందుకు పోయింటే మాత్రం కుక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉండేది

Dog Vs Lioness Amazing Fight Never Before Ever After Fight Scene

 ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో ఆడ సింహం తరుముతున్నా.. ఆ శునకం వెనుదిరిగి సింహంతో పోరాడుతున్న దృశ్యాన్ని పర్యాటకులు కొద్ది దూరంలోని జీపులో నుంచి వీక్షిస్తున్నారు.

కుక్కను ఆడసింహం కొంత దూరం తరముకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కుక్క ఆగి వెనక్కి తిరిగి సింహంపై ఎదురుదాడికి దిగింది. గట్టిగా మొరుగుతూ.. ఒక పెద్ద పిల్లితో పోరాడినట్లుగా సింహాన్ని వెనక్కి తరిమింది. దీంతో సింహం వెనకడుగు వేసింది. అనంతరం శునకం అక్కడి నుంచి పరుగెత్తింది. వీధి కుక్క సింహంతో పోరాడటం గొప్ప విషయం. జీవితంలో ఈ విధమైన నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది అని కాస్వాన్‌ ట్వీట్‌ చేశారు
Watch This Video


Previous Post Next Post