IT Exemption up to Rs 3 lakh under Sec 80C - Top Budget 2021 expectations. Budget 2021 Income Tax Expectations: Experts and individuals are hoping that Finance Minister Nirmala Sitharaman will raise the Income Tax deduction limit under Section 80C. Experts and individuals are hoping that Finance Minister Nirmala Sitharaman will raise the Income Tax deduction limit under Section 80C of the Income Tax Act up to Rs 3 lakh in the upcoming Budget. Read full details in Telugu
IT Exemption up to Rs 3 lakh under Sec 80C - Top Budget 2021 expectations
సెక్షన్ 80సీ - సడలింపుపై ఆశలు - వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.2 లక్షలకు పెంచేనా? -- రూ.3 లక్షలకు పెంచేనా?
రానున్నబడ్జెట్ 2021-22లో పన్ను మినహాయింపుపై కొన్ని వర్గాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం పన్ను(ఐటీ) శాబులను సవరించే అవకాశాలేం కన్పించడం లేదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని మాత్రం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అవకాశముందని ఐటీ అధి కారి ఒకరు తెలిపారు. అయితే, ఈ పరిమితిని రూ.3 లక్షల వరకు పెంచాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై వ్యక్తులు, నిపుణులు ఆశావాదంతో ఉన్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ ప్రొవిడెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల వంటి పెట్టుబడులపై ఆదాయంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది.
గడిచిన 4-5 ఏళ్ల నుంచి ప్రభుత్వం 80సీ పన్ను మినహాయింపు పరిమితిని యథాతథంగానే కొనసాగిస్తూ వచ్చింది. కరోనా సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు తరిగిపోయాయని, ఈ నేపథ్యంలో పన్ను చెల్లిం పుదారులందరికీ ఊరట కల్పించడం సాధ్యపడకపోవచ్చని ఐటీ అధికారి పేర్కొన్నారు. కాకపోతే, పొదుపు, పెట్టుబ డులు, గృహ కొనుగోళ్లను ప్రోత్సహించేలా ఈసారి బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐటీ సెక్షన్ 80సీ కింద వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల హెచ్ యూ ఎ)కు చెందిన వారు ఫిక్స్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్లు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్ ఫీజులు తదితరాలపై ఏడాదికి రూ.లక్షన్నర వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పరిమితిని రూ. 3 లక్షల వరకు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశంపై ట్యాక్స్ కన్సల్టెన్నీ సంస్థ అంకిత్ సెహ్రా అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, ట్యాక్స్ నిపుణులు అంకిత్ సెహ్రా స్పందిస్తూ... ఈ బడ్జెట్లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చునని అభిలాష వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.1.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపును రూ.3 లక్షల వరకు పెంచే అవకాశా లున్నాయని అంకిత్ అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే పెట్టుబడులకు ఊతమిచ్చినట్టవుతుంది. అంతేకా కుండా దేశాభివృద్ధికి ఎంతోగానో తో డ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బడ్జెట్ 20 21పై రివ్యూలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల వరకు పెంచవచ్చునని 'యస్ సెక్యూరిటీస్' విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలో సప్లయి కోసం ప్ర భుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. డిమాండ్ పరంగా చూసే కుటుం బాల ఆదాయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థలో సమాతాస్థితి ఏర్పడుతుందని 'యస్ సెక్యూ రిటీస్' పేర్కొంది. అంతేకాకుండా గృహ రుణాలపై మిన హాయింపుల తోసహా రియల్ ఎస్టేట్ డిమాండ్ కు తగ్గట్టు విధానా లను ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. జీతాలపై ఆధారపడే వర్గాలకు హెచ్ ఆర్ఏ పరిమి తులకు అనుగుణంగా గృహరుణరీపేమెంట్లవెసులుబా టును కల్పించవచ్చునని విశ్లేషించింది.
సెక్షన్ 80డీ పరిమితి కూడా పెంచే అవకాశం
కరోనా వ్యాప్తితో ఆరోగ్య బీమా ఆవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై ఐటీ పన్ను మినహాయింపు పరిమితిని సైతం పెంచేందుకు అవ కాశాలున్నాయి. ప్రస్తుతం, ఐటీ సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది.
పూర్తి స్పష్టత కొరకు వచ్చే బడ్జెట్ సమావేశం వరకు వేచి చూడాల్సిందే