Krishna DCCB Bank Recruitment 2021 - 100 Assistant Manager and Staff Assistants/Clerks APPLY. Applications are invited for Appointment to the post of ‘Assistant Manager and Staff Assistants/Clerks’ in The Krishna District Cooperative Central Bank Ltd., Machilipatnam from only candidates domicile of Krishna District Opening Date for ON-LINE Registration of Application 22.01.2021
Closing date for ON-LINE Registration of Application 31.01.2021
Dates for Payment of Application Fee 22.01.2021 to 31.01.2021
Tentative date of written test/Online test In the month of February,2021
AGE (as on 01.01.2021): Minimum 18 years – Maximum 30 years

Krishna DCCB Bank Recruitment 2021 - 100 Assistant Manager and Staff Assistants/Clerks APPLY

కృష్ణా సహకార బ్యాంకులో మేనేజర్లు, క్లర్కు పోస్టులు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్
అసిస్టెంట్ మేనేజర్లు, స్టాఫ్ అసిస్టెంట్ (క్లర్కులు) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలున్నాయి. పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధా రంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

అసిస్టెంట్ మేనేజర్లు
మొత్తం 28 పోస్టులున్నాయి.
ఇందులో 9 పోస్టులను మహిళలకు కేటాయిం చారు.
ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అవగాహన తప్పనిసరి. కంప్యూటర్ సామర్థ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇన్-సర్వీస్ అభ్యర్థులకు, రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయి.
ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులకు, ఇంటర్వ్యూ 12.5 మార్కులకు ఉంటాయి. టెస్టో రీజనింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (35 ప్రశ్నలు, 35 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు, 30 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. తప్పు సమాధా నాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఇందులో ప్రతిభను బట్టి 1:4 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టాఫ్ అసిస్టెంట్లు
మొత్తం 72 పోస్టులున్నాయి. వీటిలో 26 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అవగాహన తప్పనిసరి. కంప్యూటర్ సామర్థ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇన్-సర్వీస్ అభ్యర్థులకు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఉంటాయి.

ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (35 ప్రశ్నలు, 35 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు, 30 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. మొత్తం పోస్టుల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పనిచేసే సిబ్బందికి 18 ఖాళీలు కేటాయించారు. వీటిలో 8 పోస్టులను మహిళలకు ప్రత్యేకించారు.

వేతనం: ప్రారంభ వేతనం అసిస్టెంట్ మేనేజర్లకు రూ. 33,000, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.24,000.
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, మచిలీపట్నం , గుడ్లవల్లేరు, అగిరిపల్లి, మైలవరం, పెడన
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో , చివరి తేదీ: 31 జనవరి
ఆన్లైన్ / రాత పరీక్ష: ఫిబ్రవరిలో ఉంటుంది.
వెబ్ సైట్: https://krishnadccb.com/
Download Official Notification and Website: https://krishnadccb.com/notifications-for-recruitment-to-the-post-of-assistant-manager-in-krishna-dcc-bank/

Previous Post Next Post