బ్రాయిలర్ కోడి తింటున్నారా..? అయితే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి. ఎందుకో తెలుసా..? బాయిలర్ కోడి మాంసం తినే వాళ్లు తప్పక చదవవలసిన సమాచారం. కోడిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో బ్రాయిలర్ కోడిని తినడం ద్వారా అన్నే నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్రాయిలర్ కోళ్లను తినడం ద్వారా జరిగే సైడ్ ఎఫెక్ట్‌లు ఏంటో ఓసారి చూద్దాం..
బ్రాయిలర్, ఫారం కోడి మాంసం వలన కలిగే అనారోగ్య సమస్యలను గురించి తెలుసుకుందాం
కోడిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో బ్రాయిలర్ కోడిని తినడం ద్వారా అన్నే నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్రాయిలర్ కోళ్లను తినడం ద్వారా జరిగే సైడ్ ఎఫెక్ట్‌లు ఏంటో ఓసారి చూద్దాం.. సాధారణంగా చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో కోడి కూర ఉడకాల్సిందే. చికెన్ ఫ్రై, బిర్యానీ, చికెన్ 65, చికెన్ పులుసు అని రకరకాల పేర్లతో కోడి వంటకాన్ని లొట్టలేసుకుంటూ తింటుంటారు. అయితే కోడిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో బ్రాయిలర్ కోడిని తినడం ద్వారా అన్నే నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్రాయిలర్ కోళ్లను తినడం ద్వారా జరిగే సైడ్ ఎఫెక్ట్‌లు ఏంటో ఓసారి చూద్దాం..
ఓ పరిశోధన ప్రకారం పౌల్ట్రీ ఫామ్‌లలో పెంచే కోళ్లు, ఇతర నాన్‌వెజ్ ఉత్పత్తులను తరుచు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఎక్కువ వేడిలో వండిన గ్రిల్ చికెన్ వంటి వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. మగవారిలో ఈ ప్రమాదం మరీ ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
పౌల్ట్రీ ఫామ్‌లలో పెంచే కోళ్ల ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియాలు ప్రవేశించే అవకాశం మెండుగా ఉంటుందట. చికెన్‌ను పూర్తిగా శుభ్రం చేయకుండా వండుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనేది నిపుణుల సూచన..
60 సిగిరెట్లు తాగితే ఎంత ప్రమాదకరమో ఒక బ్రాయిలర్ చికెన్ లెగ్ పీస్ తింటే అంత డేంజర్ అట.. అంతే కాకుండా ఎక్కువ వేడి చేస్తే చికెన్‌లో ప్రోటీన్లు తగ్గడంతో అది కూడా అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉందట..
సాధారణంగా శరీరానికి మంచి కొవ్వు అవసరం ఉంటుంది. అయితే బ్రాయిలర్ కోళ్ల ద్వారా శరీరంలోకి చెడు కొవ్వు ప్రవేశిస్తుంది. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫామ్‌లలో పెంచే కోళ్లు త్వరగా బరువు పెరగడానికి వాటికి అందించే ఆహారంతో పాటు కొన్ని రకాల సిరంజీలను కూడా ఎక్కిస్తుంటారు. దీని వల్ల ఊబకాయంతో పాటు మహిళల సంతానోత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందట..
కోళ్లు త్వరగా పెంచేందుకు గాను వాటికి యాంటీ బయోటిక్స్ ఎక్కిస్తుంటారు. దీనివల్ల శరీరంలోకి భారీ ఎత్తున యాంటీ బయోటిక్స్ వెళ్లడంతో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇది పురుషులకు కాస్త కలవరపెట్టే అంశం.. క్రమం తప్పకుండా బ్రాయిలర్ కోళ్లను ఆహారంగా తీసుకుంటున్న పురుషుల్లో శుక్రకణాల సామర్థ్యం తగ్గడంతోపాటు సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుందట.
చికెన్ తినాలనిపిస్తే మన పూర్వీకులు తరహాలో నాటు కోడి, నాటు కోడి గుడ్లను మాంసాహార ప్రియులు నిరభ్యంతరంగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..