సామాన్యులకు భారీ షాక్.. కొండెక్కనున్న వీటి ధరలు.. ఇప్పుడే కొనేయండి!
ఎండా కాలం వచ్చేసినట్లు ఉంది. ఎండలు చంపేస్తున్నాయి. అందువల్ల మీరు కూలర్, ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్ వంటివి కొనాలని భావిస్తే.. ఇప్పుడే కొనేయండి. లేదంటే ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రధానాంశాలు:
మధ్యతరగతికి చుక్కలు
పెరగనున్న ధరలు
చాలా మందిపై ఎఫెక్ట్


సామాన్యులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ధరలు పెరుగుతూనే వెళ్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు ధరలు పెరిగాయి. ఇప్పుడు మరి కొన్నింటి ధరలు కూడా పైకి కదిలేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో సామాన్యులపై ప్రభావం పడనుంది.

ఇప్పటికే ఎండులు బాగా పెడుతున్నాయి. దీంతో చాలా మంది కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి వారికి ఝలక్ తగలనుంది. కంపెనీలు ఏసీ, కూలర్, ఫ్యాన్ వంటి వాటి ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఏసీల ధరలు 4 నుంచి 6 శాతం మేర పెంచేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. అంటే ఏసీల ధర రానున్న రోజుల్లో రూ.2 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పాలీమర్స్, కాపర్, స్టీల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి. దీంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఏసీ, ఫ్రిజ్ కూలర్, ఫ్యాన్ ధరలు పెరగనున్నాయి. అందువల్ల మీరు వీటిల్లో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే కొనేయడం ఉత్తమం.
Previous Post Next Post