Civil Services Prelims 2021 Notification - 712 Posts UPSC Indian Civil Service Recruitment IAS IPS. Civil Services (Prelims) Exam 2021 – 712 Posts Civil Services (Preliminary) Examination, 2021 UPSC Civil Services (Pre) Recruitment 2021 – Apply Online for 712 Vacancy. UPSC has released the Indian Civil Services Preliminary Exam Notification for 2021. Details are as follows:
Civil Services Prelims 2021 Notification - 712 Posts UPSC Civils Prelims Notification 2021
UPSC has released the Indian Civil Services Preliminary Exam Notification for 2021. Details are as follows:. Union Public Service Commission (UPSC) has announced notification for the recruitment of Civil Service (Prelims) Exam 2021 vacancies on permanent basis Application Fee
General: Rs. 100/-
SC/ ST/ Female & PwBD: Nill
- Starting Date for Apply Online: 01-03-2021
- Last Date to Apply Online: 24-03-2021
- Last Date for Fee Payment (Online): 24-03-2021
- Date for online application Withdrawn: 31-03-2021 to 06-04-2021
- Date of Civil Service (Pre) Exam: 27-06-2021
Age Limit (as on 01-08-2021) Age: 21 Years - 32 Years
Qualification : Candidates should posses Degree from a recognized University.Vacancy Details | |
Post Name | Total |
Civil Service (Prelims) Exam | 712 |
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీ ఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమి నరీ పరీక్ష జూన్ 27వ తేదీన జరుగనుంది. మూడంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశ అత్యున్నత సర్వీసులైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏ ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎస్ఎస్) వంటి 19 సర్వీసుల్లో మొత్తం 712 పోస్టులను భర్తీ చేస్తారు
పరీక్ష: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్గామినేషన్ 2021భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య: 712
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే..
వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎన్నిసార్లు రాయొచ్చు జనరల్ అభ్యర్థులు ఆరుసార్లు రాసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఓబీసీలు తొమ్మి దిసార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
పరీక్ష విధానం - సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమి నరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైమ్), మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఉంటాయి. - ప్రిలిమినరీ పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి . ప్రతి పేపర్ 200 మార్కులకు జరుగుతుంది. పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీసం 38 శాతం మార్కులు సాధించాలి. ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.
ప్రిలిమినరీ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. - ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్ పరీక్షలో ఇంగిష్ పేపర్ 300 మార్కులకు, స్థానిక భాషకు సంబంధించిన మరో పేపర్ 300 మార్కులకు ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటిలో సాధించే మార్కులను మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. సివిల్స్ మెయిన్ పరీక్షలో ఒక ఎస్సే పేపర్ 250 మార్కులకు, ఒక్కోటి 250 మార్కుల చొప్పున నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, అలాగే ఒక ఆప్షనల్ సబ్జెక్టుపై రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున ఉంటాయి.
మొత్తంగా సివిల్స్ మెయిన్ రాత పరీక్ష 1750 మార్కులకు జరుగుతుంది. మెయిన్లో -ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు పిలు స్తారు. ఇంటర్వ్యూకు 275 మార్కులు కేటా యించారు. అంటే.. మొత్తం 2025 మార్కులకు అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధా రంగా తుది జాబితా రూపొందిస్తారు.
ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ/ ఎస్టీలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తులకు చివరి తేది: 24.03.2021
ప్రిలిమినరీ పరీక్ష తేది: 27 జూన్ 2021
ఈ అడ్మిట్ కార్డ్: ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి మూడు వారాల ముందు నుంచి ఈ అడ్మిట్ కార్డ్ యూపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు.
వెబ్ సైట్: https://upsconline.nic.in
Notification Download