Counting Procedure of Municipal Votes 2021 ULB Municipal Elections. ఓట్లు లెక్కించు విధానం. 


Counting Procedure of Municipal Votes 2021 ULB Municipal Elections

COUNTING DUTY:
కౌటింగ్ హాలుకు ఉదయం 5 గంటలకు కౌంటింగ్ సిబ్బంది అందరూ హాజరుకావాలి.
ప్రతీ టేబులుకు 1 సూపర్వైజర్, 3 కౌంటింగ్ అసిస్టెంట్సు ఉంటారు
కౌంటింగ్ మెటీరియల్ ప్రతీ టేబులుకు ఆర్.ఓ., సరఫరా చేస్తారు.
పెన్ నైఫ్, స్పాంజ్ డేంపర్, చిన్నవి పెద్దవి రబ్బరు బాండ్సు, పెన్సిల్, పెన్, వైట్ పేపరు, పేపర్ వెయిట్, ప్లాస్టిక్ ట్రేలు

ఏజెంట్సుకు సూచనలు:
బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రకారం పోలైన ఓట్లు మరియు బేలట్ బాక్సులో గల ఓట్లలో తేడా వున్నట్టయితే బ్యాలెట్ బాక్సులో వున్న ఓట్లు మాత్రమే లెక్కిస్తామని ఏజెంట్లకు వివరించుటు.
చెల్లుబాటు మరియు చెల్లుబాటుకాని ఓటు వివరాలు ఏజెంట్సుకు వివరించుట
డౌట్ ఫుల్ ఓట్లనుండి చెల్లుబాటు మరియు చెల్లుబాటుకాని ఓట్లను వేరుచేసిన తరువాత చెల్లుబాటుకాని ఓట్లను ఎట్టిపరిస్థితిలోను తిరిగి తెరవడం జరగదని చెప్పాలి.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తాం అని చెప్పాలి.  

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు- సూచనలు:
పోస్టల్ బ్యాలెట్ వుంచిన కవర్-28 ని కౌటింగ్ రోజు ఆర్.ఓ. గాని /ఏ.ఆర్.ఓ.గాని తెరవాలి
అందులో ఫార్ము – 26 లో ఓటర్ డిక్లరేషన్ మరియు కవర్-27 (బ్యాలెట్ పేపరు వున్న కవరు) వున్నాయో లేదో సరిచూసుకోవాలి.
ఫార్మ్-26 లో ఓటర్ డిక్లరేషన్ మీద సంతకం చేసారా లేదా అని చూసుకోవాలి. అదేవిధంగా గజిటడ్ ఆఫీసర్ కౌంటర్ సైన్ చేసారా లేదా చూడాలి.
ఓటర్ సదరు ఫార్ము-26 పై సంతకం చేయకపోయినా, గజిటెడ్ అధికారి సర్టిఫై చేయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లదు.
ఫార్ము-26 సరిగా వున్నట్లయితే ఆ ఫార్ములో వున్న సీరియల్ నెంబరు, కవర్-27 (బ్యాలెట్ పేపరు వున్న కవరు)పై వున్న సీరియల్ నెంబరు సరిచూసుకోవాలి.
సీరియల్ నెంబరు సరిపోకపోతే కవర్-27 (బ్యాలెట్ పేపరు వున్న కవరు) తెరవకూడదు.
ఇలా డిక్లరేషన్ లేనివి, సీరియల్ నెంబరు సరిపోనివి రిజెక్టు చేసి తిరిగి కవర్-28 లో వుంచాలి. అటువంటి కవర్లు అన్నీ ప్రత్యేకమైన కవర్లో వుంచి సీలుచేయాలి. ఆ కవరుపై వివరాలు నింపాలి.

చెల్లుబాటైన పోస్టల్ బ్యాలెట్లు:
డిక్లరేషన్ పై ఓటర్ మరియు గజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసివున్నప్పుడు, సీరియల్ నెంబరు సరిపోయినప్పుడు మాత్రమే ఆ ఓట్లను లెక్కింపుకు పరిగణనలోకి తీసుకోవాలి.
ఫార్ము-26 లో వున్న డిక్లరేషన్లు అన్నీ ప్రత్యేకమైన కవర్లో సీల్ చేయాలి.
కవర్-27 (బ్యాలెట్ పేపరు వున్న కవరు) తెరిచి అందులోనుండి బ్యాలెట్ పేపర్లను బయటకుతీయాలి.
అలా తీసిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లును ముందుగా చెల్లుబాటు మరియు చెల్లుబాటు కాని ఓట్లగా విభజించాలి.
చెల్లబాటు అయిన ఓట్లను అభ్యర్థివారీగా వేరుచేసి లెక్కించాలి.
ఆ సంఖ్యను వెంటనే రిజల్టుషీట్లో ఫార్ము-30 లో ఆర్.ఓ., నింపాలి.
చెల్లుబాటైన పోస్టల్ బ్యాలెట్లను, చెల్లుబాటుకాని పోస్టల్ బ్యాలెట్లను వేరువేరుగా సీలుచేయాలి.
ఏజంట్లతో కూడా వాటిపై వారి ప్రత్యేకమైన సీలు వేయించవచ్చును.

బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు- సూచనలు:
వార్డులో పోలింగు స్టేషన్ల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరవాలి.
ఒక టేబులుకు ఒక్కొక్క పోలింగు బాక్సునే ఇవ్వాలి.
ఒకేసారి రెండు లేదా మూడు బాక్సులను ఇవ్వరాదు.
ఒక బాక్సులో ఓట్లు ఇనీషియల్ కౌటింగు పూర్తయిన తరువాత రెండవ బాక్సు ఇవ్వాలి.  

బ్యాలెట్ బాక్సు - పరిశీలన:
బ్యాలెట్ బాక్సులపై సీలును ఏజెంట్సును పరిశీలించుకోమని చెప్పాలి.
బాక్సు ఏ పోలింగు స్టేషనుకు చెందినదో పరిశీలించుకోమని చెప్పాలి.
పేపర్ సీరియల్ నెంబరును పరిశీలించుకోమని చెప్పాలి.
బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రకారం పోలైన ఓట్లను ఏజెంట్లకు చెప్పాలి.
బ్యాలెట్ బాక్సులో గల ఓట్లను మాత్రమే లెక్కిస్తామని వారికి వివరించాలి.

ఇనీషియల్ కౌటింగు:
బ్యాలెట్ బాక్సులో గల ఓట్లను మెల్లిగా తీసి ఖాళీ ట్రేలలో వేయాలి.
ఖాళీ బాక్సును ఏజెంట్సుకు చూపించాలి.
బ్యాలెట్ పేపర్ల అడ్డ మడతను విప్పి నిలువు మడత వుండగానే ఒకదానిపై ఒకటి పెట్టి 25 చొప్పున రబ్బరు బ్యాండ్ పెట్టాలి.
అన్ని బ్యాలెట్ పేపర్లును 25 చొప్పున కట్టిన తరువాత ఆఖర్లో మిగిలి పోయిన ఓట్లను వేరే కట్టగట్టి వాటిని సులువుగా గుర్తించడం కోసం రెండు రబ్బరు బ్యాండ్లను పెట్టాలి.
25 చొప్పున కట్టిన కట్టలను, విడిగా వున్న బ్యాలెట్ పేపర్ల మొత్తాన్ని లెక్కించాలి.
బ్యాలెట్ పేపర్ అకౌంట్ లో సూచించిన బ్యాలెట్ పేపర్ల సంఖ్యకు, బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పేపర్ల సంఖ్యకు తేడా వునట్టయితే ప్రొఫార్మా-1 నింపాలి. కౌటింగ్ సూపర్వైజరు సంతకం చేసి, ఏజెంట్లతో సంతకం చేయించాలి.
బ్యాలెట్ బాక్సులో వున్న ఓట్లకు మాత్రమే లెక్కింపు చేయాలి.
ప్రతీ బ్యాలెట్ బాక్సులో గల బ్యాలెట్ పేపర్లను 25 కట్లను కట్టిన తరువాత ఒక పెద్ద డ్రమ్ములో వెయ్యాలి
డీటైల్ కౌటింగు:

పెద్ద డ్రమ్ములో గల బ్యాలెట్ పేపర్ కట్టలను ప్రతీ టేబులకు 1000 చొప్పున (40 కట్టలు) ఇవ్వాలి.
ప్రతీ బ్యాలెట్ పేపరును ఏజెంట్లకు చూపిస్తూ గుర్తులుగల లెక్కింపు ట్రేలో వేయాలి.
సందేహం గల (డౌట్ ఫుల్) ఓట్లను మరియు నోటా గుర్తించిన ఓట్లను ప్రత్యేకమైన ట్రేలో వేయాలి.
సందేహం గల (డౌట్ ఫుల్) ఓట్లను ఆర్.ఓ. / ఏ.ఆర్.ఓ. లు పరిశీలించిన తరువాత చెల్లుబాటు అయినవి గుర్తులవారీగా ట్రేలో వేసి, చెల్లుబాటుకానివి ప్రత్యేకంగా కట్టగట్టాలి.
అనంతరం గుర్తులవారీగా వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను లెక్కించి కౌంటింగ్ సూపర్వైజర్ కు సంఖ్యను తెలియజేయాలి.
కౌంటింగ్ సూపర్వైజర్ గుర్తులు వారీగా ఫార్ము-2లో వివరాలు నింపి ఏజెంట్లతో సంతకాలు చేసి ఆర్.ఓ. / ఏ.ఆర్.ఓ. లకు సమర్పించాలి.
అన్ని టేబులల్లో మొదటి రౌండు పూర్తవ్వగానే టేబులువారీ అభ్యర్థివారీగా ఆర్.ఓ. / ఏ.ఆర్.ఓ. లు ఓట్లసంఖ్యను ఏజెంట్లకు తెలియజేయాలి.
తరువాత రౌండు లెక్కింపు చేయాలి.
అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తరువాత అభ్యర్థివారీగా వచ్చిన ఓట్ల సంఖ్యను కూడి రిజల్టు ప్రకటించాలి.
రిజల్టు ప్రకటించిన 15 నిముషాలలో అభ్యర్థులు రీ-కౌంటింగుకు అభ్యర్థించవచ్చును.
అటువంటి అభ్యర్థన రాకపోతే వెంటనే ఈ క్రింది ఫార్మ్సు నింపాలి.
ఆర్.ఓ. / ఏ.ఆర్.ఓ. ఫార్ము-30ని ఫైనల్ రిజల్టు షీటును నింపాలి.
తరువాత ఫార్ము-31ని డిక్లరేషన్ ఆఫ్ రిజల్టు ఆఫ్ ఎలక్షన్ ను నింపాలి.
తరువాత ఫార్ము-32ని రిటర్మ్ ఆఫ్ ఎలక్షన్ ను నింపాలి.
అభ్యర్థి వారీ ఓట్లను 50 చొప్పున తిరిగి కట్టలు కట్టి, అభ్యర్థివారీగా కవర్లో పెట్టి అటువంటి అన్ని కవర్లను పెద్ద పేకెట్ చేసి సీలు చేయాలి.
ట్రై వచ్చిప్పుడు:
ఇద్దరు లేదా ఎక్కువమంది అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు అనగా టై అయినప్పుడు
సమానమైన కొలతల, ఒకే రంగులో గల స్లిప్పులు తయారుచేయాలి
ప్రతీ అభ్యర్థిపేరును ఐదు స్లిప్పులపై రాయాలి. అనగా ప్రతీ అభ్యర్థికి ఐదు చొప్పన స్లిప్పులను రాయాలి.
వాటిని కలిపి అందులో నుండి ఒక స్లిప్పును ఆర్.ఓ. / ఏ.ఆర్.ఓ. డ్రా తీయాలి.
ఎవరి పేరు అయితే ఆ స్లిప్పులో వస్తుందో ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటించాలి.

సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్:
ఫార్ము – 33 లో సర్టిఫికేట్ ఎలక్షనును గెలుపొందిన అభ్యర్థికి ఆర్.ఓ. మాత్రమే సంతకం చేసి ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంటు తీసుకోవాలి. 

సీలింగు చేయాల్సిన కవర్లు:
(1) the packets of unused ballot papers with counterfoils attached thereto;
(2) the packets of used ballot papers whether valid, rendered or rejected. This also includes the packets in which covers containing postal ballot papers received later are kept)
(3) the packets of the counterfoil of used ballot papers,
(4) the packets of the marked copy of the electoral roll; and
(5) the packets of the declarations by electors and the attestation of their signatures

In view of the important nature of these election papers, these papers should be sealed with the seal of the Returning Officer.
The papers mentioned at item (2) (except packets of tendered ballot papers) and Item (5) above shall be made into packets at the time of counting. Such packets shall be sealed by Returning Officer own seal immediately after the counting of the votes is over.

Previous Post Next Post