ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఒంగోలు
విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన ఆర్.సి. నం.3/144/2019/S.R.D తేది:.03.2021
విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన - ప్రకాశం జిల్లా 2020-21.
విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన ఆర్.సి. నం.3/144/2019/S.R.D తేది:.03.2021
విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన - ప్రకాశం జిల్లా 2020-21.
Prakasam District Backlog Recruitment 2021 - 34 Posts Recruitment for Physically Disabled Persons
వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 34 బ్యాక్ లాగ్ పోస్తులకై ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. ధరఖాస్తు చివరి తేది : 22.03.2021 సాయంత్రం 05.00. గంటల లోపు.ధరఖాస్తు చేసిన నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరములు పైబడి
తేది: 01.07.2020 నాటికి 52 (42+10) సంవత్సరములు దాటి ఉండరాదు.
సూచనలు::
ధరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయస్సు 18+ సంవత్సరములు పైబడి తేది:01.07.2020 నాటికి 52 (42+10) సంవత్సరములు దాటి ఉండరాదు అభ్యర్ధి బయోడేటా తో పాటు సదరం వైద్య ధృవీకరణ పత్రం జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీచేయబడి శారీరక చలన / దృష్టి లోపం గల దివ్యాంగులైతే కనీస వైకల్యం 40 శాతం మరియు బధిర మూగ, చెవుడు దివ్యాంగులు ఐతే కనీస వైకల్యం 75 శాతము కలిగి వుండాలి. అభ్యర్ధి నిర్ణీత ధరఖాస్తుతో పాటు
1.సదరం వైద్య ధృవీకరణ పత్రము
2 .విద్యార్హత ధృవీకరణ పత్రములు
3.ఎంప్లాయ్మెంట్ కార్డు
4. 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు బొనోఫైడు ధృవ పత్రములు
5. స్థిర నివాస ధృవీకరణ పత్రములు
6. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన ప్రతి తో పాటుగా ఆన్ లైన్ లో చేసిన అన్ని దృవీకరణ పత్రాలు (జీరాక్స్) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రకాశం భవనం. ఒంగోలు -523001 నకు తేది: 22.03.2021 సాయంత్రం 05.00 గంటల లోగా స్వయంగా కాని లేదా తన ప్రతినిది తో కాని వచ్చి సమర్పించగలరు.
ఒకే అభ్యర్ధి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన ప్రతి పోస్టునకు విడి విడి గా ధరఖాస్తు చేయవలెను.
ఎంపిక విధానము
జి.వి.యం.యస్.నెం.2, స్త్రీ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, తేది.19-02-2020 ప్రకారం, మహిళలకు ప్రకటించబడిన పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేనిచో అదే విభాగములో గల పురుష అభ్యర్థులను నియమించబడును.
1 నుండి 4 వరకు చూపిన డి ఎస్ సి పరిధిలోని ఉద్యోగాుకు ప్రభుత్వం ఉత్తర్వులు .నెం.74 సాధారణ పరిపాలన , సర్వీసెస్ -ఎ డిపార్టుమెంటు తేది: 14-07-2007 ప్రకారం డిగ్రీలో సాధించిన అత్యధిక మార్కుల ఆధారముగా ఎంపిక జరుగును.
5. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ (DMLT), BSC (MLC) ఆధారముగా
6. ఎలెక్ట్రికల్ డిప్లామానందు ఉత్తీర్ణత లేదా హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారముగా
7. ఇంటర్ తో పాటు 2 సంవత్సరముల యం, పి.హెచ్.ఎ కోర్సు ఉత్తీర్ణత 8 నుండి 12 వరకు చూపిన పోస్టులకు వైకల్య శాతానికి 20 మార్కులు, వయస్సుకు 20 మార్కులు, ఎంప్లాయిమెంట్ సీనియారిటీకు 10 మార్కులు ఇచ్చి వాటి మొత్తము పై వచ్చిన మార్కుల ఆధారముగా మెరిట్ లిస్టు ప్రకటించబడును.
గమనిక: డి.ఎస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలకు 5 వ తరగతి, 1 వ తరగతి, చదివిన వారిని బోన్ పైడ్ స్టడీ సర్టిఫికేట్ కలిగిన వారికి పరిగనములోకి తీసుకోనబడును.
అందులకు 5వ తరగతి, 7వ తరగతి, అర్హత లేకున్నా 10 వ తరగతి నేరుగా చదివినట్లుయితే పైన పేర్కొన్న క్రమ సంఖ్య 8 నుండి 12 వరకు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
క్రమ సంఖ్య 1 నుండి 4 వరకు చూపిన పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానము కల్గి వుండాలి. ఇందులో మెరిట్ లిస్టులోని స్థానాలలో వున్న అభ్యర్థులకు యస్.ఐ.సి.ఒంగోలు వారి ద్వారా కంప్యూటర్ టెస్ట్ నిర్వహించబడును. వారు కంప్యూటర్ చేయలేకపోతే మెరిట్ లిస్టు లోని మరియొక అభ్యర్ధికి అవకాశం ఇవ్వబడుతుంది.
ఏ పోస్ట్ నకు ఎంపిక అయిన అభ్యర్ధి అట్టి ఉద్యోగమునకు సంబంధించిన విధులు తానే ఖచ్చితముగా నిర్వర్తించవలసి ఉంటుంది. విధి నిర్వహణలో వైకల్యం కారణము చూపి విధులు నిర్వహించలేను అనరాదు. ఎంపిక ప్రక్రియ రోజే అభ్యర్ధి అట్టి ద్రువీకరణ పత్రము కమిటీ వారికి అందచేయాలి.
ఏ కారణం చేతనైన ప్రకటించిన అభ్యర్ధి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టులోని తర్వాత అభ్యర్ధిని పరిగణలోకి తీసుకోబడుతుంది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడును అట్టి దరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు చేయబడవు.
ఈ ప్రకటనలోని ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు మరియు మార్పులు చేర్పులు లేదా ప్రకటన పూర్తిగా రద్దు పరచే అధికారము జిల్లా కలెక్టర్ వారికి కలదు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 104, తేది 24.3.2000 సాధారణ పరిపాలన యస్. పి. యఫ్.ఎ ప్రకారం అంధులు మరియు బదిరుల స్థానిక నివాసము నిర్ణయించబడును.