Havells launches Stealth Puro Air- India's first Air Purifying Ceiling Fan with 3-Stage Filtration. Havells India on Monday become India’s first company to unveil a tech-savvy ceiling fan, which equipped with a 3-stage air purifier that filters PM 2.5 and PM 10 pollutant along with VOC filtration and delivers an approximate Clean Air Delivery Rate (CADR) of130 cu. m/hrStealth Pufo Air by Havells 


గాలిని శుద్ధి చేసే సీలింగ్ ఫ్యాన్  రికార్డు సృష్టించిన హావెల్స్ - Stealth Puro Air by Havells

- Stealth Puro Air by Havells
ఇది గాలిని శుద్ధి చేసే సీలింగ్ ఫ్యాన్.. రికార్డు సృష్టించిన హావెల్స్
న్యూఢిల్లీ: కన్జుమర్ డ్యూరబుల్ కంపెనీ హావెల్స్ ఇండియా లిమిటెడ్ గాలిని శుద్ధి చేసే సీలింగ్ ఫ్యాన్‌ను ఆవిష్కరించింది. ఫలితంగా ఇలాంటి సాంకేతికతను ఆవిష్కరించిన తొలి భారత కంపెనీగా రికార్డులకెక్కింది. మూడు దశల్లో గాలిని శుద్ధి చేసే ఈ ఫ్యాన్ ఖరీదు రూ. 15 వేలు మాత్రమే. ఈ ఫ్యాన్ గంటలకు 130 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. దీనిపేరు ‘స్టెల్త్ ప్యూరో ఎయిర్’.

ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారిని ఉద్దేశించి ఈ ఫ్యాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అన్ని ఫ్యాన్‌లలా ఇది గాలిని నలువైపులకు పంపించడమే కాకుండా అదే సమయంలో శుద్ధి చేస్తుంది. ఇందులో హెచ్‌ఈపీఏ ఫిల్టర్‌ను కూడా అమర్చారు. ఇది కార్బన్‌ను యాక్టివేట్ చేస్తుంది. ప్రీఫిల్టర్ విష పదార్థాలను గ్రహించి స్వచ్చమైన గాలిని విడుదల చేస్తుంది. ంతోపాటు ఈ ఫ్యాన్‌లో అదనంగా మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, కిందివైపు లైటు, ఎల్‌ఈడీ ఎయిర్ ప్యూరిఫైర్ ఇండికేటర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఫ్యాన్‌లో ఎరోడైనమిక్ బ్లేడ్స్‌ను ఉపయోగిండంతో ఎలాంటి శబ్దం లేకుండా గాలిని విడుదల చేసింది.

దీంతోపాటు కంపెనీ ‘హావెల్స్ ఫ్యాన్‌మేట్’ ఫ్యాన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులోనూ కార్బన్ ఫిల్టర్లు ఉన్నాయి. దీనికితోడు గాలిని మనకు ఇష్టమైన దశలో మరల్చుకునే సదుపాయం కూడా ఉండడం విశేషం. మూడు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకుని ఆపరేషన్స్ చేసుకోవచ్చు

Previous Post Next Post