Andhra Bank Customers now Union Bank Customers - Rules to remember from 1st April. Andhra Bank: Andhra Bank now Union Bank - Rules to remember from 1st April

పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు నేటి నుంచి కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమరా? గతంలో ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉందా? ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిన సంగతి తెలిసిందే. పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు నేటి నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోవాలి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనం పూర్తైంది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇకపై ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకుంటారు. ంధ్రా బ్యాంక్ కస్టమర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా మారినా పాత అకౌంట్ నెంబర్ అలాగే ఉంటుంది. అకౌంట్ నెంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అకౌంట్ నెంబర్‌తో పాటు కస్టమర్ ఐడీ కూడా పాతదే ఉంటుంది

ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు కొత్త పాస్ బుక్స్ వస్తాయి. ఆ పాస్ బుక్స్ అన్నీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు తమ పాస్ బుక్స్ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్ యాప్ కూడా పనిచేయదు. కస్టమర్లు U-Mobile యాప్ ఉపయోగించాలి.

ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంక్ చెక్స్ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత పనిచేయవు. అంటే మీరు ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI చెక్స్ మాత్రమే ఉపయోగించాలి. బ్యాంకులో కొత్త చెక్ బుక్స్ తీసుకోవచ్చు ఇక ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా మారుతుంది. ప్రస్తుత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ 2021 మార్చి 31 వరకే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉపయోగించాలి. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మీ బ్రాంచులో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి

ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది కాబట్టి కస్టమర్లు ఏవైనా సందేహాలు ఉంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 కాగా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110 ఇటీవలే ఆంధ్రా బ్యాంక్ అన్ని బ్రాంచుల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తైందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI ప్రకటించింది. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలు అందించిన అన్ని సర్వీస్ బ్రాంచ్‌లు, స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసధానమయ్యాయి
Previous Post Next Post