Krishnapatnam CORONA Ayureda Medicine - Details - Formula - Report by Doctors Formula and Medicine Prepared by Krishna Patnam Ayurveda Doctor for CORONA COVID 19. The secret of MUTTUKUR KRISHNAPATNAM NELLORE District Ayurvedic Doctor medicine for CORONA COVID 19 is revealed. There are 5 Types of Medicines distributed by the Doctor.

 Krishnapatnam CORONA Ayureda Medicine - Details - Formula - Report by Doctors

శ్రీయుత జిల్లా కలెక్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆదేశముల మేరకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు కోవిడ్ 19 నకు ఆయుర్వేద చికిత్స పై జిల్లా పంచాయతి అధికారి వారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారు, రెవిన్యూ డివిజనల్ అధికారి, నెల్లూరు వారు, ఆయుర్వేద డాక్టర్లు మరియు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి & తహసీల్దార్ వారితో విచారణ జరిపి సమర్పించు నివేదిక :

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు శ్రీ బొరిగి ఆనందయ్య అనువారు కోవిడ్ 19 నకు ఆయుర్వేద చికిత్స చేయుచున్నారు. అతను, గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులైన శ్రీ గురవయ్య స్వామి మరియు చెన్నై పట్టణం రెడ్ హిల్స్ ప్రాంతమునకు చెందిన వివేకానంద అను సిద్ధ వైద్యుల వద్ద ఆయుర్వేద చికిత్స నేర్చుకొన్ననని తెలిపియున్నారు. ఇతను గతములో సర్పంచ్ గా మరియు MPTC గా పనిచేసియున్నానని తెలిపియున్నారు. తను ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ మందు రోగులకు అందిస్తున్నని తెలిపినారు.

తాను, గత నెల శ్రీరామ నవమి నుండి అనగా 21-4-2021 నుండి కోవిడ్ 19 నకు చికిత్స చేయుచున్న ననియు, మొదట పదులలో పేషంట్లు వచ్చేవారనియు తదుపరి ఆ సంఖ్య వందలకు పెరిగి ప్రస్తుతము రోజుకు 4 వేల నుండి 5 వేల మంది వరకు తాను ఇచ్చు ఆయుర్వేద మందు కొరకు వచ్చుచున్నారని నదని తెలిపినారు.

సదరు శ్రీ బొరిగి ఆనందయ్యను తాను కోవిడ్ 19 నకు తయారుచేయు మందుల యొక్క వివరములు తెలుపమని కోరగా వారు ఈ క్రింది విధముగా తెలిపియున్నారు. అతను, కరోన నివారణ నిమిత్తం 5 (అయిదు) రకములైన మందులు తయారుచేసి పేషంట్లకు ఇచ్చుచున్నానని తెలిపి వాటిని తయారు చేయు విధానము ఈ క్రింద విధముగా తెలిపియున్నారు.

Formula and Medicine Prepared by Krishna Patnam Ayurveda Doctor for CORONA COVID 19




ఆయుర్వేద డాక్టర్ గార్ల నివేదిక :
  • 1. The person dispensing the medicine is not a qualified person in Ayurvedic medicine.
  • 2. The formulation given by the person is also not a standards recipe.
  • 3. The ingredients used are general herbs only.
  • 4. The method of preparation and dosages is sub-standard
  • 5. On collecting public opinion we don't have any negative comment.
  • 6. In Live also we witnessed a case of oxygen low saturation being raised.
  • 7. We cannot confirm that it is due to that drug only, may be due to eye irritation.
  • 8. We are of opinion that the ingredients in the eye drops may be harmful to the eye sight in long run.
  • 9. We are of opinion that the medicine may be given a fair clinical trial in quarantines and Covid Care Centres for two to three weeks under Ayurvedic Medical Officers supervision without other medicines.

తదుపరి స్థానికంగా హాజరైన ప్రజలతో మాట్లాడుట జరిగినది, హాజరైన ప్రతి ఒక్కరు సదరు ఆయుర్వేద మందు పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినారు. ఎవ్వరును సదరు మందు వలన ఎటువంటి చెడుప్రభావములకు లోనుకాలేదని తెలిపియున్నారు. స్థానిక పత్రికా విలేఖరులు మరియు ABN ఛానల్ వారు కూడా తాము ప్రతి నిత్యము ఆ ప్రాంతమును  సందర్శించుచున్నామనియు, ఇక్కడకు వచ్చు రోగులు ఈ ఆయుర్వేద మందు తిన్న తరువాత స్వస్థత చేకూరి వారి వారి ప్రాంతములకు సంతోషముగా తిరిగి వెళుతున్న రనియు, ఒక్కరు కూడా తమకు అనారోగ్యము తగ్గనట్లుగా చెప్పలేదని తెలిపియున్నారు.

 కావున, పై విచారణ తరువాత తమరికి సమర్పించుకోనునది ఏమనగా ; సదరు ఆయుర్వేద చికిత్స కొరకు అవలంబించుచున్న ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావలసియున్నది మరియు చికిత్స తరువాత వచ్చు పరిణామాలపై పరీక్షలు జరగవలసియున్నది. కానీ నేటి వరకు సదరు చికిత్సపై ఎటువంటి వ్యతిరేక పిర్యాదులు గాని చికిత్స తరువాత తాము అనారోగ్యమునకు గురిఅయి ఉన్నామనిగాని ఎవ్వరును తెలిపియుండలేదు. మరియు అక్కడకు హాజరైన వారిలో ఒక పేషంట్ కు ఆక్సిజన్ లెవెల్స్ 83 ఉండగా అతనికి కంటిలో డ్రాప్స్ చేసిన గంట తరువాత అతని ఆక్సిజన్ లెవెల్స్ 95నకు పెరిగినవి. సదరు పేషంట్ తో మేము స్వయంగా మాట్లాడటం జరిగినది.

కానీ, సదరు చికిత్స అందించు ప్రదేశము నందు ఎటువంటి కోవిడ్ నిబంధనలు పాటించుటలేదు. కావున, సదరు చికిత్స పై ఏదైనా నిర్ణయము తీసుకొను వరకు అచ్చట కోవిడ్ నిబంధనలు అమలు చేయునట్లుగా స్థానిక అధికారులను ఆదేశించవలసియున్నది. విచారణ నివేదిక తగు చర్య నిమిత్తము సమర్పితము.

Download the Detailed Report PDF
Previous Post Next Post