SALT to enhance education in Andhra Pradesh SALT Supporting Andhras Learning Transformation SALT Program in Andhra Pradesh Schools.
The main objectives of the programme called Supporting Andhra's Learning Transformation (SALT) are strengthening foundation schools and providing training and skill development to teachers, Andhra Pradesh Education Minister Audimulapu Suresh said.
Andhra Pradesh has started a programme to transform foundational learning in government schools for which the World Bank has approved a loan of 250 million dollars.

LOGO OF SALT The five-year programme is result-oriented with the WB releasing funds after key goals are achieved. The government has converted all Anganwadis into pre-primary schools and attached them to the nearest schools. Minister Suresh said the two years of pre-primary school would be considered as part of primary education. The government’s document on SALT documents several challenges to improving the learning outcomes. These include inadequate facilities in schools and a need for increased focus on foundational learning, the need for upgrading teaching skills of teachers, improving teacher-student interactions in classes, and capacity development of state-level institutions such as the Andhra Pradesh State Council of Education Research and Training (SCERT), State Institute of Education Management and Training (SIEMAT) and District Institutes of Education and Training (DIETs). 

SALT to Enhance Education in Andhra Pradesh - Supporting Andhras Learning Transformation

కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కారు.
విధివిధానాలను రూపొందించిన అధికారులు.
.
రూ.1,860 కోట్లు అందించనున్న IBRD.

 రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి సాల్టు పేరుతో కొత్త విద్యా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో ఏపీ అభ్యసన పరివర్తన సహాయ పథకంగా దీనికి నామకరణం చేశారు. ఆంగ్లంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్ (సాల్ట్). 2021-22 నుంచి 2026-27 వరకు ఐదేళ్ల కాలపరిమితితో దీనిని అన్ని పాఠశాలల్లో అమలుచేస్తారు. 

ఈ పథకానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బాంకు (ఐ.బి.ఆర్.డి) 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ.1,860 కోట్లు) ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీనిద్వారా ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో అభ్యసనాన్ని బలోపేతం చేయడం లక్ష్యం. ఉపాధ్యాయ, విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు సంస్థాగత సామర్థ్యాలను పెంచడం, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలో పేతం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలను చేపట్టి, అభ్యసనాభివృద్ధికి కృషి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

సాల్టు పథకం కోసం తయారుచేసిన లోగో

ఇదీ కార్యాచరణ ప్రణాళిక

 ⚡️ప్రాథమిక స్థాయిలో శిశు సంరక్షణ విద్యను (ఈసీసీఈ) పాఠశాలలకు అనుసంధానం చేస్తారు.
⚡ అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించి సామర్ధ్యాల కేంద్రీకృతంగా, ఆటపాటల ఆధారిత బోధన చేపడతారు.
⚡️ తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరుస్తారు. పాఠశాల భద్రత, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.
⚡️ ప్రామాణిక ప్యాకేజీ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు (మానసిక, శారీరక దివ్యాంగుల) కోసం వనరుల కేంద్రాలను పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తారు.
⚡️ ప్రతి పాఠశాలలో ప్రామాణిక సాధనం (స్టాండిటైజ్డ్ టూల్)ను ఉపయోగించి బోధనా కార్యక్రమాలను పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తారు.
⚡️ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం (LMS)లో విద్యకోసం పనిచేస్తున్న రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డిఐటిఇ)లను అనుసంధానం చేసి వాటి ద్వారా పాఠశాలలో విద్యాభివృద్దికి కృషి చేస్తారు.
⚡️ ఐదేళ్ల పాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంపుదలకు వీలుగా శిక్షణ ఇస్తారు. ⚡️ ఎప్పటికప్పుడు విద్యారులు, ఉపాధ్యాయుల స్థాయిని తెలుసుకోవడానికి మదింపు సర్వే నిర్వహిస్తారు.
⚡️ తల్లిదండ్రుల కమిటీతో ప్రతి ఏటా పాఠశాలల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సామాజిక తనిఖీలను నిర్వహిస్తారు.
⚡️ పాఠశాలల్లో భద్రత, విపత్తు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతారు.
⚡️ పర్యావరణ, సామాజిక అంశాల నిర్వహణ బృందం ద్వారా పాఠశాలల్లో పర్యావరణం, సామాజిక వ్యవస్థలను మదింపు చేస్తారు.

పథకం నిర్వహణ ఇలా....

రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐ.ఎ.ఎస్ అధికారి, జాయింటు డైరెక్టరు స్థాయి అధికారిని నియమిస్తారు. అన్ని జిల్లాల్లో అమలుకు వీలుగా జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. 

కరోనా అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

Previous Post Next Post