ఆనందయ్య మందు కంట్లోనే ఎందుకు? ఆయుష్ సీఎంవో కామేశ్వరావు చెప్పిన షాకింగ్ సీక్రెట్
ఆనందయ్య మందును కంట్లోనే ఎందుకు వేయాలి?
దాని వల్ల లాభం ఏమిటీ?
ఆయన మందు తీసుకున్న కోటయ్య ఎందుకు చనిపోయారు?
ఈ సందేహాలకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, ఆయుష్ సీఎంవో (ఎంసీడీ) డాక్టర్ కామేశ్వరరావు చెప్పిన ఆసక్తికర విషయాలు.
The Secrets of Anandayya Medicine - Revealed by Dr Kameswara Rao Ayush CMO MCD
కరోనా వైరస్ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. కోవిడ్-19 రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ వినిపించింది. ఆనందయ్య మందును అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, కంటిలో వేసే మందు తప్ప.. మిగతావన్నీ రోగులకు అందివచ్చని షరతు విధించింది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. మిగతా ఔషదాలకు అనుమతి ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులు.. ఆనందయ్య మందును కంట్లో వేయగానే లేచి ఎలా కూర్చుంటున్నారు? ఆక్సిజన్ స్థాయిలు అమాంతంగా ఎలా పెరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటీ? కంట్లో వేసే ఆ మందు సురక్షితమైనదేనా? గతంలో ఎప్పుడైనా దీన్ని ఉపయోగించారా? అనే సందేహాలకు ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కామేశ్వరావు మాట్లాడుతూ ఆనందయ్య మందు ప్రత్యేకతలను ఇలా వివరించారు.
ఆనందయ్య మందు మంచిదేనా?:
ఆనందయ్య మందును పరిశీలించేందుకు వెళ్లినవారు.. ఆయుర్వేద పుస్తకాల్లోని ఆ ఫార్ములా కోసం వెతికారు. ఆయన ఏ కాంబినేషన్ మందును రోగులకు ఇస్తున్నారో తెలుసుకోడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన అందులో వాడుతున్న మూలికలు, ఇతరాత్ర ముడి పదార్థాలు శరీరానికి పనికివచ్చేవే. అందుకే రిపోర్టులో ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించకపోవడానికి మరో కారణం కూడా ఉంది. దాన్ని ఆయన ఆయుర్వేద మందుగా పేర్కొంటే.. దాని కోసం లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. అది ఏ రకమైన మందో తెలపాలి. ఇదంతా పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ మందు వల్ల ఎవరికీ హాని లేకపోవడం, ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ఆలస్యం చేకుండా అనుమతి ఇచ్చారు. ఇది ఆయుర్వేద మందు కాదని, దీనితో కరోనా తగ్గుతుందనే ఆధారం లేదని రిపోర్ట్ ఇచ్చారు. ఆనందయ్య మందు స్థానిక ఔషదమని, ఇష్టం ఉన్నవారు తీసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల ఆయుర్వేద మందుల తరహాలోనే దీన్ని తయారు చేయడం సాధ్యం కావడం లేదు.
ఈ మందు ఎప్పటి నుంచో ఉంది:
పాము కాటుకు వంశపారంపర్యంగా మందు వేసే వైద్యుల్లో ఆయన కూడా ఒకరు. సాధారణంగా పాము కాటుకు పసర వైద్యం చేస్తారు. అందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన వేస్తున్న పసర మందు ఇప్పటికిప్పుడు తయారు చేసినది కాదు. ఎప్పటి నుంచో ఉంది. కరోనా సమయంలో ఆయన దాన్ని ప్రయోగించి ఉండవచ్చు. ఆయనకు సిద్ధ వైద్యంపై కూడా అవగాహన ఉంది. పంచ మహాభూతాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితాన్ని నిలబెట్టవచ్చనే ఫార్ములాతో ఆయన మూలికలను ఉపయోగించారు. కంటిలో మందు వేయడమనేది కొత్త విషయం కాదు. కానీ, కరోనా వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆయనకు ఈ ఆలోచన రావడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే.. పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోతారు. కాబట్టి.. ఆయనకు ఆ ఆలోచన వచ్చి ఉండవచ్చు. పైగా ఆయన కంట్లో వేసేందుకు ఉపయోగిస్తున్న పదార్థాలు, మూలికలు సురక్షితమైనవి. వాటిలో ఏవీ హానికరమైనవి కావు.
కంట్లోనే ఎందుకు?:
కంట్లో మందు వేయడాన్ని అలోపతి నిపుణులు వ్యతిరేకించవచ్చు. కానీ, శరీరంలో ఫాస్టెస్ అబ్జర్వేటివ్ రూట్ కంజుంక్టివా (కంటి పొర). అక్కడ డ్రాప్స్ వేస్తే వెంటనే మెదడులోకి వెళ్లిపోతుంది. పాత కాలంలో మందులు లేనప్పుడు పసర్లు పోసేవారు. పాము కాటు తర్వాత మెదడుకు ఆక్సిజన్ అందకపోతే చనిపోతారు కాబట్టి.. చివరి ప్రయత్నంగా పసర్లు పోసి ప్రాణం నిలబెట్టేవారు. ఈ విషయంలో ఆనందయ్య ఐడియాలజీ చాలా బాగుంది. అయితే, ఆయుర్వేదంలోని కొందరు వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ, వ్యక్తిగతంగా చెప్పాలంటే.. ఆయన పద్ధతి బాగా పనిచేస్తోంది. ఆయన అందులో వాడుతున్న ముడిసరుకు కూడా హానికరం కాదు.
కోటయ్య మరణానికి కారణం?:
కోటయ్యకు ఆక్సిజన్ స్థాయిలు బాగా పడిపోయిన తర్వాత ఆనందయ్య వద్దకు తీసుకొచ్చారు. ఆయన మందు వేయగానే ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయి. అయితే, ఆ వెంటనే ఇంటికి కాకుండా అలోపతి వైద్యాన్ని తిరిగి కొనసాగిస్తే ఆయన బతికేవారేమో. ఎందుకంటే.. ఆ మందు కేవలం బ్రెయిన్‌కు మాత్రమే ఆక్సిజన్ అందిస్తుంది. ఊపిరితీత్తులకు కాదు. కరోనా ప్రభావం చాలా తక్కువ, సాధారణంగా ఉండే వ్యక్తులకే ఇది బాగా పనిచేస్తుంది. తీవ్రంగా ఉండేవారికి తాత్కాలిక ఉపశమనం కలిగినా.. అలోపతి వైద్యంతో చికిత్స పొందాలి. కానీ, ఆనందయ్య మందును వేసుకోగానే కరోనా తగ్గిపోయిందనే భావించి ఇంటికి వెళ్లిపోతున్నారు. దీనిపై ఆయుర్వేదం, అలోపతి సంయుక్తంగా అధ్యయనం చేయాలి. ఆనందయ్య మందు ఆక్సిజన్ అందిస్తున్న నేపథ్యంలో అలోపతి వైద్యం ద్వారా ఆ రోగులు త్వరగా కోలుకోనేలా వైద్యులు ప్రయత్నించాలి. ఆనందయ్య మందు కూడా ఇప్పుడు ఆక్సిజన్ పెంచేందుకు ఉపయోగిస్తున్న అలోపతి మందులు, 2డీ మందుల తరహాలోనే పనిచేస్తుంది. ఈ మందును మేం కూడా తయారు చేసి ప్రయత్నించాం. ఆక్సిజన్ స్థాయిలు పెరగడాన్ని గమనించాం. ఆయుర్వేదంలో కూడా ఇలాంటి చికిత్స ఒకటి ఉంది. దాని ప్రకారం తమిళనాడుకు చెందిన ఓ రోగిపై ప్రయోగం చేశాం. ఆమె ఆక్సిజన్ స్థాయిలు పెరిగడంతో.. లేచి కూర్చున్నారు. కాబట్టి.. ఆక్సిజన్ పెంచుకోడానికి ఆయుర్వేదంలో కూడా డ్రగ్స్ ఉన్నాయి.