UGC Job Portal
నెట్ సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసినవారు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం.
జాబ్ పోర్టల్ ప్రారంభించిన యూజీసీ
1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-NET పాసయ్యారా? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-SET క్వాలిఫై అయ్యారా? ఏదైనా అంశంలో పీహెచ్‌డీ పూర్తి చేశారా? మీలాంటివారి కోసం యూజీసీ సరికొత్త జాబ్ పోర్టల్ ప్రారంభించింది.
2. నెట్ సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసినవారు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు యూజీసీ ప్రారంభించిన జాబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది.
3. నెట్ సెట్ క్వాలిఫై అయినవారికి, పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి యూనివర్సిటీలు, కాలేజీల్లో అనేక ఉద్యోగాలు ఉంటాయి. అయితే యూనివర్సిటీలు, కాలేజీలు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి.
4. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు విడుదల చేసే జాబ్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఒకేచోట లభించట్లేదు. దీంతో నెట్, సెట్ క్వాలిఫై అయినవారికి ఆ ఉద్యోగాల గురించి తెలియట్లేదు.
5. ఈ సమస్యకు పరిష్కారంగా నెట్ సెట్ క్వాలిఫై అయినవారి కోసం యూజీసీ ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ప్రారంభించింది. నెట్, సెట్ క్వాలిఫై అయినవారు, పీహెచ్‌డీ పూర్తి చేసినవారు https://ugc.ac.in/jobportal/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
6. యూజర్లు https://ugc.ac.in/jobportal/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్‌లోనే ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు... ఈ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు కూడా ఉంటాయి. అందులో తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఉంటే అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
7. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 54767 మంది నెట్ అభ్యర్థులు, 14133 మంది నెట్ జేఆర్ఎఫ్ అభ్యర్థులు, 15296 మంది సెట్ అభ్యర్థులు, 26808 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
8. టీచింగ్ పోస్టులు మాత్రమే కాదు నాన్ టీచింగ్ ఖాళీలకు సంబంధించిన వివరాలను కూడా ఇదే వెబ్‌సైట్‌లో అందించేందుకు యూజీసీ కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ జాబ్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసి మరికొందరికి అందుబాటులోకి తీసుకురానుంది.