ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో జరిగి వివిద రకాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. EAPCETను కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారు. ఆగస్ట్ 19 నుంచి 25 వరకు EAPCET జరుగుతుంది. ఈ పరీక్షకు చైర్మన్‌గా రామలింగరాజు, కన్వీనర్‌గా రవీంద్రను నియమించారు. సెప్టెంబర్ 19న జరిగే ఈ-సెట్‌ను అనంతపురం జేఎన్టీయూ నిర్వహిస్తుంది. ఈ-సెట్ చైర్మన్‌గా రంగనాథం, కన్వీనర్‌గా శశిధర్లను నియమించారు. ఐ సెట్‌ను నిర్వహించే బాధ్యతను విశాఖపట్నంలోని ఏయూకు అప్పగించారు. సెప్టెంబర్ 17, 18న ఐ సెట్ పరీక్ష జరుగుతుంది. ఐ సెట్ చైర్మన్‌గా ప్రసాదరెడ్డి, కన్వీనర్‌గా శశిభూషణ్‌రావులను నియమించారు.
AP CET Dates Released ECET ICET APEAPCET LAWCET 2021 Dates Released
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ
సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్‌ను నిర్వహిస్తుంది. పీజీఈ సెట్
చైర్మన్‌గా రాజారెడ్డి, కన్వీనర్‌గా సత్యనారాయణలను నియమించారు. లా సెట్ ను
నిర్వహించే బాధ్యతను తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీకి
అప్పగించారు. సెప్టెంబర్ 22న లా సెట్ పరీక్షను నిర్వహిస్తారు. లా సెట్
చైర్మన్‌గా జమున, కన్వీనర్‌గా చంద్రకళను నియమించారు. విశాఖలోని ఏయూ
ఆధ్యర్యంలో సెప్టెంబర్ 21న ఈడీ సెట్‌ను నిర్వహిస్తారు. ఈడీ సెట్
చైర్మన్‌గా ప్రసాదరెడ్డి, కన్వీనర్‌గా వెంకటేశ్వరరావును నియమించారు.
APEAPCET ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ICET: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ECET: సెప్టెంబర్ 19న ఈసెట్ (అనంతపురం జేఎన్‌టీయూ),
EDCET : సెప్టెంబర్ 21న ఎడ్‌సెట్ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి.
LAWCET: తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న లాసెట్,
PGCET: సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.