YSR Kadapa Anganwadi Recruitment 2021 - APPLY for 288 Anganwadi Posts. ICDS -WDCW has released recruitment notification for Anganwadi Teachers Helpers in Kadapa District. Those who wants to apply can Send their Application form Offline. Details of the Kadapa Anganwadi Recruitment 2021 is given below.
Kadapa Anganwadi Recruitment 2021 - APPLY for 288 Anganwadi Posts
పథక సంచాలకుల వారి కార్యాలయము, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కడప.నోటిఫికేషన్ ప్రకటన సంఖ్య WDCW-ADMOAPT/22/2021-SA-ICDS-RJP, తేది: _/08/2021.
కడప జిల్లా యందు దిగువ తెలుపబడిన వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల యందు ఖాళీగా యున్నటువంటి జతపరుచబడిన జాబితాల యందు తెలుపబడిన అంగన్వాడి కార్యకర్త (50), సహాయకురాలు (225), మరియు మినీ అంగన్వాడి కార్యకర్త (13) పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును మొత్తం ఖాళీలు: 288
1) అంగన్వాడీ కార్యకర్త: 50
2) అంగన్వాడీ సహాయకురాలు: 225
3) మినీ అంగన్వాడీ కార్యకర్త: 13
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకి చివరి తేది: 31.08.2021.
చిరునామా: స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్.
ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు:
1. 01.07.2021వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
2. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యిఉండాలి.
3. అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
4. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు
7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
5. యస్.సి./ఎస్.టి. హాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.
6. నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)
7. పై పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ ఒక యూనిట్ రిజర్వేషన్ పద్ధతిన ఎంపిక చేయబడుట జరుగును.
8. పై పోస్టుల భర్తీ దిగువ తెలుపబడిన పారామీటర్ల ప్రకారము భర్తీ చేయబడును.
9. కావున అభ్యర్థులు పై 1 నుండి 5 వరకు తెలుపబడిన పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు నమూనా యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును.
10. తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారము రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.
11. ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తీనకు సంబందించి, ఆయా కేసులకు సంబంధించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును.
ఈ పోస్టుల నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్తులకు
ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను అటీస్టేషన్ తో వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది:31.08.2021
ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యకులు, మరియు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కడప వారికి సర్వ హక్కులు కలవు. Download Notification Click Here
Download Application Form Click Here
Official Website: Click Here