NATIONAL SCHOLARSHIP PORTAL


2021 ఫిబ్రవరి లో జరిగిన NMMS పరీక్షలో ఎంపికైన ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ సంవత్సరం నవంబరు 15 లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in అనే కేంద్ర వెబ్ సైట్ నందు వారి వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో స్కాలర్షిప్ మంజూరు కాబడదు.

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. 
1) స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పించుట 
2) స్కూలు లేదా ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ 
3) డి. ఇ . ఓ. లేదా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్


(1) స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పించుట:

ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు విద్యార్ధి యొక్క ఆధార్ మొదలగు వివరములు సమర్పించుట ద్వారా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. (విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగము, తండ్రి పేరు మెరిట్ లిస్ట్ లోనూ మరియు విద్యార్ధి యొక్క ఆధార్ లోనూ ఒకే విధంగా ఉండవలెను. ఒక్క అక్షరం లేదా ఒక ఖాళీ తేడా ఉన్నా కూడా అప్లికేషన్ అప్లోడ్ అవ్వదు). రిజిస్ట్రేషన్ చేసిన తరువాత చరవాణికి వచ్చిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అయ్యి అప్పి కేషన్ ను సమర్పించవలెను. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి యొక్క వివరములు మెరిట్ లిస్ట్ లోని వివరములతో ఖచ్చితంగా సరిపోలవలెను. లేని పక్షంలో అప్లికేషన్ upload అవ్వదు . విద్యార్థి యొక్క ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ పూర్తిగా నమోదు అయ్యి ఉండవలెను. రిజిస్ట్రేషన్ చేసేసిన తరువాత గనుక ఏమైనా తప్పులు ఉన్నట్టు గ్రహిస్తే, విద్యార్ధి లాగిన్ కు లాగిన్ అయ్యి Withdraw Application ను ఎంపిక చెయ్యడం ద్వారా మరలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కలుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరుకు User Name మరియు Password లు SMS వస్తాయి. ఆ User Name మరియు Password లను ఉపయోగించి లాగిన్ అయ్యి అప్లికేషన్ ను ఫిల్ చేయవలెను. ఆ విధముగా ఫిల్ చేసిన అప్లికేషన్ ను చివరగా సబ్మిట్ చేయవలెను. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను ప్రింట్ తీసుకుని అప్లికేషన్ తో పాటు బ్యాంకు పాసుబుక్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ మొదలగు డాక్యుమెంట్లను జతపరచి ఒక కాపీని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించవలెను. మరియు మరియొక కాపీ ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యంలో ఉంచుకొనవలెను. అప్లికేషన్ లో ఇచ్చిన మొబైల్ నెంబరు కే OTP లు వస్తాయి గనుక అదే నెంబరును నాలుగు సంవత్సరాల కాలం వరకు పనిచేసే విధంగా చూసుకొనవలెను.

ఏ విద్యార్థి అయినా వేరే స్కీం (Other Welfare Schemes) లో స్కాలర్షిప్ తీసుకుంటు ఉంటే గనుక ముందుగా ఆ స్కీం కి లాగిన్ అయ్యి Withdraw Application అనే ఆప్షన్ ద్వారా ఆ స్కీం నుండి Withdraw అవ్వాలి. అప్పుడు మాత్రమే NMMS స్కీం లో అప్లై చేసుకొనుటకు అవకాశం కలుగుతుంది. 


(2) స్కూలు లేదా ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్:

ప్రతి పాఠశాల వివరములను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు రిజిస్టర్ చేయవలెను. స్కూల్ లాగిన్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయుని (HM) లాగిన్ మరియు పాఠశాల నోడల్ ఆఫీసర్ (INO) లాగిన్ అని రెండు లాగిన్ లు ఇవ్వడం జరిగినది. ప్రధానోపాధ్యాయుని లాగిన్ ద్వారా సంబంధిత విద్యార్ధుల యొక్క వివరములను గమనించుటకు మాత్రమే వీలు అవుతుంది. పాఠశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా సంబంధిత విద్యార్ధుల యొక్క అప్లికేషన్ లను వెరిఫై చేయుటకు వీలు కల్పించబడినది. రెండు లాగిన్ లకు కూడా వారి వారి ఆధార్ వివరములను నమోదు చేయవలెను. దీనికి గానూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని యొక్క ఆధార్ వివరములను ప్రధానోపాధ్యాయుని లాగిన్ లోనూ మరియు పాఠశాల నోడల్ ఆఫీసర్ యొక్క ఆధార్ వివరములను పాఠశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ నందు నమోదు చేయవలెను. INO మరియు HM ల యొక్క ఆధార్ కు లింకు అయిన చారవాణి కి వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లు వస్తాయి. INO మరియు HM ల యొక్క ఆధార్ వివరములు నమోదు చేసిన పాఠశాల వివరములను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారు Verify చేసిన తరువాత స్కూల్ ఉపాధ్యాయుని మొబైల్ నెంబరుకు వచ్చిన వివరములతో లాగిన్ అయ్యి Administration లో మొదటి ఆప్షన్ అయిన update profile ను ఫిల్ చేయవలెను. Administration లో రెండవ ఆప్షన్ అయిన Add Updated Details లో గల Add and Update Course Level ను, Add and Update Course ను, Add Annual Course Fee ను మరియు Update Annual Course Fee ను ఫిల్ చేయవలెను. అప్పుడు మాత్రమే Student Login లో విద్యార్థికి School మరియు Class ఎంచుకొనుటకు వీలు కలుగును.

National Scholarship Portal లో సబ్మిట్ చేసిన ప్రతి అప్లికేషన్ ను సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ (INO) లాగిన్ ద్వారా Verify చేయవలెను. Verify చేయు సమయంలో విద్యార్థి యొక్క Bank Passbook, Aadhar మొదలగు అన్ని ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని వివరములు సరిగా ఉన్న యెడల మాత్రమే Verify (Approve) చేయవలెను. లేని పక్షంలో Defect అను Option ని క్లిక్ చేయడం ద్వారా మరల స్టూడెంట్ లాగిన్ ద్వారా తప్పు ఎంట్రీలను సరిచేయవలెను. Reject కొట్టకూడదు. రిజెక్ట్ కొట్టిన అప్లికేషన్ లను సంబంధిత DEO లాగిన్ లో గల Re-Verification అను ఆప్షన్ ద్వారా మాత్రమే సరిచేసుకునే వీలు ఉంటుంది. కనుక ఎట్టి పరిస్తితుల్లో కూడా అప్లికేషన్ ను Reject కొట్టకూడదు.

స్కూల్ లాగిన్ లో Verify (Approve) చేసిన తరువాత పొరపాటును గుర్తించినట్లయితే సంబంధిత DEO లాగిన్ లో Defect అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మరలా స్టూడెంట్ లాగిన్లో అప్లికేషన్ ని సరిచేసుకొనే అవకాశం వస్తుంది. కనుక ఈ విధంగా చేసి అప్లికేషన్ లో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకుని ఫైనల్ Submission చేయవలెను.

ప్రతి అప్లికేషన్ కూడా సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ (INO) మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారు తప్పకుండా Verify (Approve) చేయవలెను. అప్పుడు మాత్రమే విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరు కాబడుతుంది. కనుక సంబంధిత స్కూల్ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని స్కూల్ మరియు DEO స్థాయిలో Verify (Approve) అయినదో లేదో పరిశీలించవలెను.


(3) డి. ఇ . ఓ. లేదా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్:

పాఠశాల లాగిన్ ద్వారా Verify (Approve) అయిన దరఖాస్తులు డిస్ట్రిక్ట్ నోడల్ అఫీసర్ (DNO) లాగిన్ ద్వారా తప్పకుండా Verify (Approve) చేయవలెను. దీనికొరకై విద్యార్ధులు భౌతికంగా సమర్పించిన ఆధార్, బ్యాంకు పాస్ బుక్ మొదలగు వాటిని పరిశీలించి సరిచూసిన తరువాత మాత్రమే డి.ఇ.ఓ లేదా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా అప్రూవ్ చేయవలెను. ఈ విధంగా మూడు స్థాయిలలో వెరిఫై అయిన దరఖాస్తుదారులకు మాత్రమే ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. 

ముఖ్య గమనిక:
మొదట ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ద్వారా National Scholarship Portal లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థి తదుపరి సంవత్సరాలలో అనగా 10, 11, 12 తరగతులకు తప్పకుండ రెన్యువల్ చేసుకొనవలెను. పదవ తరగతి తరువాత సంబంధిత కళాశాల వారు ఆ అప్లికేషన్ ను Verify (Approve) చేయవలెను. 10 వ తరగతి తరువాత విద్యార్థి చదువుతున్న కళాశాల వివరములు మరియు ఫోన్ నెంబర్ ను స్కాలర్షిప్ కు ఎంపిక అయిన 8 వ తరగతి చదివిన స్కూల్ వారికి తెలుపవలెను మరియు కళాశాల స్టడీసర్టిఫికెట్ ను సంబంధిత విద్యాశాఖాధికారి వారి కార్యాలయం లో అప్లికేషన్ తో పాటు జతపరచవలెను.

National Scholarship Portal లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి తన బ్యాంకు ఖాతాను 4 సంవత్సరాల కాలం Operative Stage లో ఉంచుకొనవలెను. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు స్కాలర్షిప్ మంజూరు చేసి SBI, న్యూ డిల్లీ వారు సంబంధిత విద్యార్ధి బ్యాంక్ ఖాతాలో స్కాలర్షిప్ డిపాజిట్ చేసే సమయానికి బ్యాంకు అకౌంట్ Dormant (Inoperative Stage) లో గనుక ఉన్నట్లయితే ఇక ఎప్పటికీ స్కాలర్షిప్ జమచేయబడదు కనుక దీనిని గమనించగలరు.

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్; https://scholarships.gov.in/

Previous Post Next Post