TCS Smart Hiring Program Recruitment - 35000 Jobs - APPLY Online
About TCS Smart Hiring for Year of Passing 2020, 2021 & 2022  TCS Smart Hiring is exclusively for BCA, B. Sc (Math, Statistics, Physics, Chemistry, Electronics, Biochemistry, Computer Science, IT), B. Voc in CS / IT from the year of passing 2020, 2021 & 2022
Students who perform exceptionally during our TCS Smart Hiring selection process will get an opportunity to join TCS Ignite – TCS’ unique ‘Science to Software’ program. This program trains you on trending technologies and will open the doorway to a wholistic and global IT career for you
For more details on eligibility criteria, kindly refer the "Test Eligibility" section below.

 TCS Smart Hiring Recruitment - 35000 Jobs - APPLY Online

డిగ్రీ పాసైనవారికీ టీసీఎస్‌లో 35,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది టీసీఎస్. దరఖాస్తు గడువును మొదట 2021 నవంబర్ 2 అని ప్రకటించినా, అప్లికేషన్ లాస్ట్ డేట్‌ను పొడిగించింది టీసీఎస్. ఆసక్తి గల అభ్యర్థులు 2021 నవంబర్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక నవంబర్ 19న టెస్ట్ జరగాల్సి ఉంది. చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగించడంతో ఈ టెస్ట్‌ను వాయిదా వేసింది టీసీఎస్. టెస్ట్ తేదీలను త్వరలో ప్రకటించనుంది. టీసీఎస్ 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్'కు ఎవరు దరఖాస్తు చేయొచ్చు?
ఏఏ అర్హతలు ఉండాలి?
TCS Smart Hiring Program :
విద్యార్హతల వివరాలివే బీసీఏ, బీఎస్‌సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్స్ ఇన్ వొకేషనల్ పాస్ కావాలి. 2020, 2021, 2022 లో పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ అయి, ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. విద్యార్థులకు టెన్త్, ఇంటర్, డిగ్రీలో 50 శాతం మార్కులు లేదా సీజీపీఏ 5 వస్తే చాలు. 2022 లో డిగ్రీ రాసిన అభ్యర్థులకు ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ నియామకాలు పూర్తయ్యేనాటికి బ్యాక్‌లాగ్ క్లియర్ చేయాలి. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో రాణించిన అభ్యర్థులకు టీసీఎస్ ఇగ్నైట్, టీసీఎస్ యూనిక్ సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం లభిస్తుంది.
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

TCS Smart Hiring Program:
దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థులు https://www.tcs.com/careers/tcs-smart-hiring లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివి TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- మీరు రిజిస్టర్డ్ యూజర్ అయితే 'Apply For Drive' పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త యూజర్ అయితే Register Now పైన క్లిక్ చేయాలి.
Step 5- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.
Step 6- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 7- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 8- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 9- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయినట్టే. TCS Smart Hiring Program: పరీక్షా విధానం టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేసేందుకు రెండు గంటలు (120 నిమిషాల) టెస్ట్ నిర్వహిస్తోంది టీసీఎస్. వర్బల్ ఎబిలిటీపై 24 ప్రశ్నలకు 30 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీపై 30 ప్రశ్నలకు 50 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీకి 26 ప్రశ్నలకు 40 నిమిషాల చొప్పున పరీక్ష ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 35,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీసీఎస్. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 43,000 మందిని నియమించుకున్న సంగతి తెలిసిందే.

For Latest Updates and Free Alerts Click Here
Previous Post Next Post