Today's Current Affairs#1 Key Points
- రోదసీ యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు ఎవరు?
- నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వైద్యుడు?
- ఏ రెండు నదుల అనుసంధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది?
- నైపర్(సవరణ) బిల్లు–2021 ప్రధాన ఉద్దేశం?
- ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయాన్ని మెటా (ఫేస్‌బుక్) ఎక్కడ ప్రారంభించింది?
- అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించిన సంస్థ?
- పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?
- భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ లక్షణ్ సింగ్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను రూపొందించిన సంస్థ?
- కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?
Daily Current Affairs#1 AP India Current Affairs TOP Bits for Competitive Exams Edition#1
రోదసీ యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు ఎవరు?
Quick Review :
ఏమిటి : ప్రముఖ నిర్మాత యోజో హిరానో, రష్యా కాస్మొనాట్ అలెగ్జాండర్ మిస్రుకిన్‌తో కలిసి సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు?
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : జోజోటవున్ అధిపతి యుసాకు మెజావా.
ఎక్కడ : బైకనుర్ లాంచింగ్ స్టేషన్, కజకిస్తాన్.
ఎందుకు : రోదసీ నుంచి భూమిని వీక్షించేందుకు..
నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వైద్యుడు?
Quick Review :
ఏమిటి : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామిగా ఎంపిక.
ఎప్పుడు : డిసెంబర్ 7.
ఎవరు : భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మేనన్.
ఎందుకు : NASA– నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం మేరకు..
ఏ రెండు నదుల అనుసంధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది?
కెన్ నది- బెత్వా నది
కెన్ నది..
మధ్యప్రదేశ్ రాష్ట్రం, కట్ని జిల్లా, అహిర్‌గవాన్ గ్రామం సమీపంలో(కైమూర్ పర్వత శ్రేణిలో) కెన్ నది జన్మిస్తుంది. 27 కి.మీ దూరం ప్రయాణించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, బండా జిల్లా, చిల్లా గ్రామం వద్ద యమునా నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
బెత్వా నది..
మధ్యప్రదేశ్ రాష్ట్రం, రెయ్‌జెన్ జిల్లా, కుమ్రాగావ్ గ్రామం వద్ద(వింద్య పర్వత శ్రేణిలో) బెత్వా నది ఉద్భవిస్తుంది. 590 కి.మీ దూరం ప్రయాణించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, హమీర్‌పూర్ జిల్లా, హమీర్‌పూర్ సమీపంలో యమునా నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని నిర్ణయం.
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని పది లక్షలకుపైగా హెక్టార్ల పంట పొలాలకు నీటిని అందించేందుకు..
నైపర్(సవరణ) బిల్లు–2021 ప్రధాన ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నైపర్(సవరణ) బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు..
ఆసియాలోనే అతిపెద్ద కార్యాలయాన్ని మెటా ఎక్కడ ప్రారంభించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : దిగ్గజ సంస్థ మెటా (గతంలో ఫేస్‌బుక్)
ఎక్కడ : ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతం(గురుగ్రామ్, హరియాణ)
ఎందుకు : భారత్‌లో కార్యాకలాపాల నిర్వహణ కోసం..
WHO: కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?
కరోనా వైరస్‌లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్‌ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘XI’’ వస్తుంది. న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేరులో xi (షి జిన్‌పింగ్) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్‌ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్’గా కొత్త వేరియెంట్‌కు నామకరణం చేసింది.
అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించిన సంస్థ?
స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ - ప్రత్యేకతలు - ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం.
- గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ.
- 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత.
- 400 కిలోవాట్ల పవర్ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా చార్జ్ చేసేంత.
- రికార్డులు..
- గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’బ్రేక్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ను రూపొందించిన సంస్థ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రోల్స్‌రాయ్స్ సంస్థ
ఎక్కడ : యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా…
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్?
ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను రూపొందించిన సంస్థ?
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్
డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ లక్షణ్ సింగ్ రావత్(63)
డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో
జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్
ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారు. సాంకేతికంగా అడ్వాన్స్‌డ్
హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఎంఐ–17వీ5 హెలికాప్టర్
అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు
ఎయిర్‌క్రాఫ్ట్ రకం: సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు.
డిజైన్ చేసిందెవరు?: రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్.
రూపొందించింది?: రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్.
పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?
క్విక్ రివ్యూ :
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఇంకా 155.75 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉన్నందున..