6th 2022 Jan Current Affairs Key Points
6th 2022 Jan Current Affairs Key Points
1. Chopper Crash: ఎంఐ–17వీ5 ప్రమాదంపై దర్యాప్తును ఎవరి నేతృత్వంలో నిర్వహించారు?
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీసీ) జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో త్రివిధ దళాలు చేసిన దర్యాప్తు నివేదికను జనవరి 5న న్యూఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సమర్పించారు.
ఏమిటి : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదిక అందజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని బృందం
2. Covid-19: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది?
రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 5న వెల్లడించింది.
3. SAAR: ‘స్మార్ట్’ అధ్యయనానికి ఎంపికైన నగరాలు?
స్మార్ట్ సిటీల్లో వచ్చిన మార్పులు, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేందుకు రాష్ట్రంలోని రెండు నగరాలను స్మార్ట్ సిటీ మిషన్, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సంయుక్తంగా ఎంపిక చేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 47 స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా.. ఇందులో కాకినాడ, విశాఖపట్నానికి చోటు లభించింది. అలాగే స్మార్ట్ సిటీస్ అండ్ అకాడెమియా టువార్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్(SAAR) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ అధ్యయనానికి దేశంలోని 15 ప్రముఖ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలను ఎంపిక చేశారు. ఇందులో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంది. ఈ సంస్థలు ఎంపిక చేసిన నగరాల్లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను డాక్యుమెంటేషన్ చేస్తాయి.
4. United Nations: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా ఎన్నికైన దేశాలు?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా రెండేళ్ల కాలానికి 2021, జూన్ నెలలో ఎన్నికైన అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాలు 2022, జనవరి 4న బాధ్యతలు చేపట్టాయి. ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది అశాశ్వత సభ్యదేశాలు ఉంటాయి.
5. 2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థ?
మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా 2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిలిచింది.