AP Job Mela: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.16,500 వేతనం..AP JOB Mela APSSDC Hetero Drugs Ranga Motors Recruitment APPLY for 160 Vacancies
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. తాజాగా మరో Job Mela కు సంబంధించిన ప్రకటన చేసింది APSSDC. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ HETERO DRUGS, Sri Ranga Motors Pvt Ltd సంస్థల్లో 160 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను చూడొచ్చు
AP JOB Mela APSSDC Hetero Drugs Ranga Motors Recruitment APPLY for 160 Vacancies
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Hetero Drugs:
ఈ సంస్థలో 140 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
బీఎస్సీ/ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ (2019/2020/2021) చేసిన అభ్యర్థులు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16500 వేతనం చెల్లించనున్నారు. ఇతర అలవెన్స్ లు, బోనస్ లు ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.
అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Sri Ranga Motors Pvt Ltd:
సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 20 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.
ఎంపికైన వారు విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.
కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ నెల 21న శ్రీ వివేకానంద డిగ్రీ&పీజీ కాలేజీ, విశాఖ-అరకు రోడ్, ఎస్.కోట(ఎమ్)-విజయనగరం జిల్లా చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలకు 9182288475, 8555832416 నంబర్లను సంప్రదిచాల్సి ఉంటుంది.