Telecom Regulatory Authority of India (TRAI): 5జీకి మించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించే 6జీ టెలికం నెట్‌వర్క్‌ను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని మే 17న న్యూఢిల్లీలో నిర్వహించిన టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు:
దేశీయంగా ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసులు అందుబాటులో ఉండగా త్వరలో వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది.
5జీ నెట్‌వర్క్‌తో దేశీ ఎకానమీకి 450 బిలియన్ డాలర్ల మేర ఊతం లభించగలదు.
కేవలం ఇంటర్నెట్ వేగం పెరగడమే కాదు అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన కూడా వేగం పుంజుకుంటాయి.
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్ వంటి రంగాల వృద్ధికి తోడ్పాటు లభిస్తుంది.
తొలి 5జీ టెస్ట్‌బెడ్ ఆవిష్కరణ..: దేశీయంగా రూపొందించిన తొలి 5జీ టెస్ట్‌బెడ్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ముఖ్యమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో స్వయం సమృద్ధి దిశగా ఇది కీలక అడుగని ఆయన పేర్కొన్నారు.
ట్రాయ్:
Andhra Pradesh: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్‌కుమార్ మీనా గతంలో రాజ్‌భవన్ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటివరకు ఏపీ సీఈవో పదవిలో కె.విజయానంద్ కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్–సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మే 13
ఎవరు : ముఖేశ్‌కుమార్ మీనా
ఎందుకు : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు..
Chief Secretary of AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఎవరు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ మే 13న కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2022, నవంబర్ 30వ తేదీ వరకు ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సమీర్‌శర్మ పదవీ కాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. ఆ గడువు 2022, మే నెలాఖరుతో పూర్తి కానుండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సమీర్‌శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలం మరో 6 నెలలపాటు పొడిగింపు
ఎప్పుడు : మే 13
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు..
<>
5జీ నెట్‌వర్క్‌తో దేశీ ఎకానమీకి 450 బిలియన్ డాలర్ల మేర ఊతం లభించగలదు.
కేవలం ఇంటర్నెట్ వేగం పెరగడమే కాదు అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పన కూడా వేగం పుంజుకుంటాయి.
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా, లాజిస్టిక్స్ వంటి రంగాల వృద్ధికి తోడ్పాటు లభిస్తుంది.
తొలి 5జీ టెస్ట్‌బెడ్ ఆవిష్కరణ..: దేశీయంగా రూపొందించిన తొలి 5జీ టెస్ట్‌బెడ్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ముఖ్యమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో స్వయం సమృద్ధి దిశగా ఇది కీలక అడుగని ఆయన పేర్కొన్నారు.
ట్రాయ్:
- ఏర్పాటు: ఫిబ్రవరి 20, 1997
- ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
- ప్రస్తుత చైర్మన్: డాక్టర్ పీడీ వాఘేలా