2022 Cannes Film Festival: 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు–2022 ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో మే 17న అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు– నటుడు శేఖర్ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈసారి చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు. మే, 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి.
ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. మే 18వ తేదీ నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
North Atlantic Treaty Organization(NATO): నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ మే 16న ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్‌డగెన్‌లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు.
టర్కీ అభ్యంతరం..
నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మే 17న 188–8 ఓట్లతో మద్దతు పలికింది.
13th Century: కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఎక్కడ గుర్తించారు?
కాకతీయుల కాలం నాటి శివాలయం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయితీ కార్యాలయం వెనకవైపు ఉన్న ఈ ఆలయాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ గుర్తించింది. క్రీ.శ.13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయ నిర్మాణ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని.. గణపేశ్వరాలయ వాస్తు శిల్పాన్ని పోలి ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ద్వారాల ముందు రాతి కిటికీలతోపాటు గోడపైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్ ఉండటం విశేషమన్నారు.
Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మే 17న ముంబైలోని మాజగావ్ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్‌డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు.
ఐఎన్‌ఎస్ సూరత్..
ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది.
క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం.
దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు.
ఈ నౌకకు గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు.
నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు.
ఐఎన్‌ఎస్ ఉదయగిరి..

ఈ నౌకకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు.
17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక.
పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు.
ఇందులో మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు.
పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు?
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్‌లో ఉన్న బుద్ధుని జన్మస్థలం లుంబిని వనాన్ని మే 16న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీకి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. బుద్ధుని జన్మస్థలంగా భావించే మాయాదేవి ఆలయాన్ని ప్రధానులిద్దరూ దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లుంబిని బుద్ధుని జన్మస్థలమనేందుకు లభించిన తొలి శాసనాధారమైన అశోక స్తంభాన్ని సందర్శించారు. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ భవన్‌కు లుంబినిలో శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్‌లో 2566వ బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : మే 17
ఎవరు : స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్
ఎందుకు : నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమని..