Sri Satya Sai District Anganwadi Recruitment Notification 2023

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
శ్రీ సత్య సాయి జిల్లా - జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన

నోటిఫికేషన్ నెంబర్ 8849 తేది: 29-12-2022
Sri Satya Sai District Anganwadi Recruitment Notification 2023

జిల్లా లోని 07 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2022 అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

  • అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
  • అభ్యర్ధులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్ధానికులు అయి ఉండవలెను.
  • 01.07.2022  నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
  • SC  మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్ధులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
  •  అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
  • అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో మరియు G.O.MS.NO.13 WCDSCనియామకమగు అభ్యర్ధులకు ప్రభుత్వ నిబంధనలు (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును. గౌరవ వేతనం రూ:11500/-,  అంగన్వాడి కార్యకర్త సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.
  • నెలకు మినీ అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును
  • అభ్యర్ధులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
  • అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి లేకుండావెరిఫై చేసుకోవాలి.
  •  కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును.
  • దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
గమనిక:
1) ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.

2) మరిన్ని వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయం లేదా అనతపురము / సత్యసాయి జిల్లా అధికారిక వెబ్సైటు https:// SriSathyaSai.ap.gov.in. నందు చూసుకోగలరు.
Sri Satya Sai District Anganwadi Recruitment Notification 2023

3) పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా, ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్థ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్న మహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.

• మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://SriSathyaSai.ap.gov.in.ను సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను.

• పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు. 

అభ్యర్ధులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.


1 నివాసం-స్థానికురాలు అయి ఉండాలి 
2. (నేటివిటి సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్ దలగునవి.. తప్పనిసరిగా జతపరచవలయును 
3. పదవ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును 
4.5. పుట్టిన తేది & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును 
6. కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును 
7. వికలాంగత్వము వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును తప్పనిసరిగా జతపరచవలయును 
8. ఫోటో దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

ముఖ్యగమనిక
ఈ క్రింద కనపరచిన ఖాళీలలో కొన్ని కోర్టు పరిధిలో వున్నవి/పెండింగ్ లో వున్నవి ఈ నోటిఫికేషన్ లో ప్రకటన ఇవ్వడము జరిగినది, అందువలన ఈ నియమాకములలో ఎంపిక అయిన అభ్యర్థుల నియామకపు ఉత్తర్వులు తదుపరి కోర్టు తుది తీర్పుకు లోబడి వుంటాయి.

 

Title Description
Recruitment of AWWs / Mini AWWs / Helpers in Sri Sathya Sai District, Puttaparthi Recruitment of AWWs / Mini AWWs / Helpers in Sri Sathya Sai District, Puttaparthi District Women & Child Welfare & Empowerment Officer,Sri Sathya Sai District Puttaparthi
Start Date 31/12/2022
End Date 06/01/2023
Download Link Download (4 MB)
   
Previous Post Next Post