వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి అవిభాజ్య (ఉమ్మడి) విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు తేది. 10-04-2023 సాయంత్రము 5 గంటల లోపు ఆహ్వానించడమైనది. దరఖాస్తులను తేది. 27-03-2023 నుండి తేది. 10 -04-2023 సాయంత్రం 5 గంటలలోపు స్వీకరించబడును. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి కనీస వయస్సు తేది. 01-07-2023 నాటికి 18 సంవత్సరములు నిండి ఉండవలెను మరియు గరిష్ట వయస్సు (42+10) 52 సంవత్సరములు దాటి ఉండరాదు. అట్టి దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నెం. 34, కలక్టరు వారి కార్యాలయ సముదాయము, విజయనగరం వారికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా గాని స్వయముగా గాని అందజేయగలరు. గడువు తేది తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.

విజయనగరం జిల్లా విభిన్న ప్రతిభావంతులు బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన, జిల్లా కలక్టరు వారి కార్యాలయము, విజయనగరం జిల్లా- 2023





గమనిక: పై పట్టికలో చూపబడిన ఏ.ఎస్.ఎం. పోస్టుకు మూగ చెముడు (మహిళా) అభ్యర్ధులతో పాటు చలన సంబంధ (మహిళా) అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోనవచ్చును. అయితే అర్హత గల మూగ చెముడు (మహిళా) అభ్యర్ధులు లేని పక్షంలో మాత్రమే చలన సంబంధ (మహిళా) అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలింపబడును.

గ్రూప్ -4 రిక్రూట్ మెంట్ విధానము: 

G.O.Ms. No. 133, 135 GA (SER-B) Dept తేది. 12.05.2014 ప్రకారం డిగ్రీలోని మార్కులు మెరిట్ ప్రకారము మరియు సర్వీస్ కమీషన్ / డి.ఎస్.సి. చే. నిర్వహించబడు ఆఫీస్ ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగము పై పరీక్ష నిర్వహించబడును. ఆయా పరీక్షలలొ ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రకారము జూనియర్ సహాయకులు /టైపిస్ట్/ నియామకాలు జరుగుతాయి . G.O.Ms. No. 74 GA(SER-A) Dept తేది. 14-02-2007 ప్రకారము వివిధ వైకల్యాలతో వికలాంగులైన వారి కోసం గ్రూప్-IV సర్వీసులలో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి DSC చే అనుసరించబడే రిక్రూట్ మెంట్ ప్రక్రియ విధానం లో వ్రాత పరీక్ష లు మరియు మౌఖిక ఇంటర్వ్యూలు రద్దు చేయబడినాయి.

క్లాస్ -4 మరియు ఇతర పోస్టులకు ఎంపిక విధానం: 

వికలత్వానికి 25 మార్కులు, వయస్సుకు 15 మార్కులు మరియు ఎంప్లాయిమెంట్ సీనియారిటీకి 10 మార్కులు గరిష్టంగా కేటాయింపబడును. వీటిలో అత్యదికంగా మార్కులు పొందిన వారిని ఎంపిక చేయుటకు అవకాశము కలదు. ఒక వేల అభ్యర్థులకు సమాన మైన మార్కులు వచ్చినట్లయితే వారిలో వికలత్వ శాతము అత్యధికముగా ఉన్నవారికి అవకాశము కల్పించబడును. వికలత్వ శాతము కూడా సమానముగా ఉన్నట్లయితే అత్యధిక వయసు ఉన్నవారికి అవకాశము కల్పించబడుతుంది.






Click Here to Download Notification PDF
Click Here to Visit Official Website
Previous Post Next Post