కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ (ప్రాయోజిత పథకం)కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారామ్ విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల్లోపు ఉండి, రక్షణ, సంరక్షణ అవసరమైన వారి కనీస అవసరాలను తీర్చేందుకు ప్రతి నెలా ఆర్థిక చేయూత అందించటం జరుగుతుందన్నారు. ఈ పథకం గురించి ఆయన వివరిస్తూ, అర్హులకు ఆర్ధిక, ఇతరత్రా వైద్య, విద్య అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు మిషన్ వాత్సల్య కింద షరతులతో కూడిన సహాయం అందిస్తారని, స్పాన్సర్షిప్ ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారని పేర్కొన్నారు.

“మిషన్ వాత్సల్య” స్పాన్సర్ షిప్ కార్యక్రమమునకు దరఖాస్తులు ఆహ్వానం...



మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా స్పాన్సర్ షిప్ ప్రోగ్రామునకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా కలెక్టరు శ్రీ ఎ. మల్లిఖార్జున గారు ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్యలో భాగంగా ఉన్న స్పాన్సర్ షిప్ ప్రోగ్రాము ద్వారా బాలల యొక్క విద్యా వైద్య మరియు అభివృద్ధి అవసరాలకు ఉపయోగపడే విధంగా షరతులతో కూడిన ఆర్ధిక సహాయం వారి కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు.

రక్షణ, సంరక్షణ అవసరమైన బాలలు తమ సామాజిక, సాంస్కృతిక పరిసరాలకు దూరం కాకుండా వారి కుటుంబాలతో కలిసి అభివృద్ధి చెందుటకు, విద్యను కొనసాగించుటకు స్పాన్సర్ షిప్ కార్యక్రమమును మంజూరు చేయటం జరుగుతుంది.

స్పాన్సర్ షిప్ కార్యక్రమము ద్వారా ఒక బాలుడు/బాలికకు నెలకు రూ.4000/- లు చొప్పున అందించబడును. స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు.

1. వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు

2. అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు

3. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు

4. ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రుల పిల్లలు

5. బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారిపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/వేదింపులకు/దుర్వినియోగం/దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.

6. PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు.

వార్షికాదాయం :

ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 72వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6వేలకు మించకూడదు. కాల పరిమితి... జెజె బోర్డు, సీడబ్ల్యూసీ కోర్టు లిఖితపూర్వకంగా నమోదు చేసిన కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టీ స్పాన్సర్షిప్ను పొడిగించవచ్చు. ఏ సమయంలోనైనా స్పాన్సర్షిప్ అందుకుంటున్న బాలలు, ఏదైనా వసతిగృహం, బాల సదనంలో చేర్చించిన తర్వాత సహాయం నిలిపివేస్తారు. * ప్రత్యేక అవసరాలు కలిగిన బాలల విషయంలో మినహా పాఠశాలలకు వెళ్లే వారు పాఠశాల హాజరు 30 రోజులకుపైగా సక్రమంగా లేదని తేలినా సమీక్షించి, తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ఎవరు అర్హులు?

  • అనాథలుగా ఉంటూ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు
  • తల్లి వితంతువు/విడాకులు తీసుకున్న కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉంటే.... 
  • తల్లిదండ్రులు ఆర్దికముగా, శారీరకంగా అసమర్థులై పిల్లలను చూసుకోలేని కుటుంబంలోని వారు
  • జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు (ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు బాలకార్మికులు అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు. బాల యాచకులు, వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు
  • కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి 'సీఎం కేర్స్ ఫర్ పథకం కింద నమోదైన వారు.

Join Our Groups For More Govt & Private Job News Updates

Telegram
Whatsapp

Click Here to Watch Complete Details in Video

ఆర్ధిక పరిమితి :-

1. రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.

2. కుటుంబ సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 72,000/- మరియు పట్టణ ప్రాంతాలలో రూ. 96,000/- లకు మించరాదు.

స్పాన్సర్ షిప్ కాలపరిమితి :-

స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్ధిక సహాయం నిలుపుదల చేయబడుతుంది. పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)

దరఖాస్తు గడువు తేదీ:-

స్పాన్సర్ షిప్ కార్యక్రమమునకు సంబంధించిన దరఖాస్తులను తగు దృవపత్రములను జతపరిచి గడువు తేదీ. 15.04.2023 లోగా అంగన్ వాడి కార్యకర్త మరియు సచివాలయ మహిళా పోలీస్ ద్వారా సంబంధిత సి. డి. పి. ఓ,ఐ. సి. డి. యస్ ప్రాజెక్టు కార్యాలయమునకు లేదా జిల్లా బాలల సంరక్షణ విభాగం, 0/0 . జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి, ఎం. వి. పి. కోలని, విశాఖపట్నం నందు అందజేయవలెనని తెలియజేయడమైనది.

దరఖాస్తునకు జాతపరచవలసిన దృవీకరణ పత్రములు:-

1.బాలుడు/బాలిక జనన ధృవీకరణ పత్రం మరియు వారి ఆధార కార్డు

2. తల్లి, తండ్రి ఆధార్ కార్డులు

3. తల్లి/తండ్రి మరణ దృవీకరణ పత్రం మరియు మరణ కారణము మరియు గార్డియన్ ఆధార్ కార్డు

4. రేషన్ కార్డు/రైస్ కార్డు

5. కుల దృవీకరణ పత్రము

6. బాలుడు/బాలిక పాస్ పోర్టు సైజ్ ఫోటో

7. స్టడీ సర్టిఫికెట్

8. ఆదాయ ద్రవీకరణ పత్రము

9. బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీ (బాలుడు/ బాలిక ఇండివిడ్యువల్ అకౌంట్ లేదా తల్లి/తండ్రి/సంరక్షకులతో కలిపి జాయింట్ అకౌంట్)

సి. డి. పి. ఓ కార్యాలయమునకు అందిన దరఖాస్తులు అన్నింటినీ మండల స్థాయి స్క్రూటిని (కమిటీ) తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎమ్ పి డి ఓ, ఎం ఇ ఓ, సి డి పి ఓ, సంబంధిత ఐ.సి. డి. యస్ ప్రాజెక్టు సూపర్ వైజర్లు మీటింగ్ నందు ఉంచి దరఖాస్తులను నిశితముగా పరిశీలించి అర్హత కలిగి ఎంపిక చేసిన ప్రతి దరఖాస్తును కమిటీ సభ్యులు అందరూ సంతకాలు చేసిన తరువాత సదరు మీటింగ్ మినిట్స్ తో పాటు దరఖాస్తులన్నింటిని విశాఖపట్నం లోని జిల్లా బాలల సంరక్షణ అధికారి కార్యాలయములో సమర్పించవలసి ఉంటుంది.

ఎవరిని సంప్రదించాలి.

మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కోసం ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ద్వారా విస్తృత ప్రచారం. కల్పిస్తున్నారు. పాఠశాలలు, ఇతరత్రా ప్రాంతాల్లో బాలలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 15 లోగా అర్హులైన బాలలచే దరఖాస్తు చేయిస్తున్నారు.

సంప్రదించాల్సిన నెంబర్లు

  • జిల్లా ఇన్ఛార్జి బాలల సంరక్షణ అధికారి ఎం. రమేష్ (897789 17151), 
  • రక్షణ అధికారి మమత(98488 55562).

సంప్రదించాల్సిన కార్యాలయాలు 

  • జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, ప్రగతి భవన్, సెక్టారు-9 ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం.
  • జిల్లా పరిధిలోని అర్బన్-1 ఐసీడీఎస్ కార్యాలయం, 
  • విశాఖ అర్బన్ -2 ఐసీడీఎస్ కార్యాలయం, 
  • పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయం
  • భీమిలి ఐసీడీఎస్ కార్యాలయం
Click Here to Download Notification PDF

Click Here to Download Application Form

Join Our Groups For More Govt & Private Job News Updates

Telegram
Whatsapp

Previous Post Next Post