Visakha Anganwadi Notification March 2024 for 25 Vacancies, Application PDF Download Here. Memo.No.139/2022/EO Dt.15.03.2024

WD&CW Dept. - Visakhapatnam - Selection for filling up of Vacancies of AWWS/AWHs of Visakhapatnam District Notification Communicated - Reg.

1. Vacancies submitted by the CDPOS Concerned.
2.Note Orders Dt. 14.03.2024 of the District Collector & Chairman AWW's Selection Committee, Visakhapatnam District

Visakha Anganwadi Notification March 2024

The attention of the CDPOS of Visakhapatnam and Bheemunipatnam Division are drawn to the references citied, wherein the District Collector & Chairman AWWS / AWHS Selection Committee, Visakhapatnam District has accorded permission to issue notification to call for applications with time schedule 15-03-2024 to 23-03-2024 from the eligible candidate for the vacant posts of Anganwadi workers and Anganwadi Helpers duly following the norms & guidelines issued by the Government time to time. The copy of notification and the list of vacancies are herewith enclosed for taking necessary action

Therefore the CDPOS concerned are hereby directed to make necessary arrangements for giving vide publicity in the concerned villages through Dandora, Print Media, and Electronic Media etc. and pasted the notification in Office, board of Grama Ward Sachivalayam, Tahisildhar M.P.D.O.Office, Panchyathi Office etc. with proper acknowledgement. Collect applications from the eligible candidates as per norms in force.

The CDPO's are further instructed that on completion of time schedule, submit the booklets in the prescribed proforma in 6 sets (Legal size) to this office duly verify the original certificates furnished by the candidates

 Visakha ICDS Anganwadi Recruitment 2024 Telugu Details


జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం

నోటిఫికేషన్ సంఖ్య. C254804/EO/DWCWEO, తేది: 15.03.2024
విశాఖపట్నం జిల్లాలో గల (03) ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

పోస్టు పేరు  -  ఖాళీల సంఖ్య

  • అంగన్వాడీ కార్యకర్త (AWW) : 03
  • అంగన్వాడీ సహాయకురాలు (AWH) : 23

Visakha Anganwadi Recruitment 2024 Eligibility

పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

1. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.

2. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి .

3. తేది 01.07.2023 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.

4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్థులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No.38 WDCW& DW (ICDS) Dept, Dated 03.11.2008).

5. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబంధిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.

Visakha District Anganwadi Notification Application Submission

6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ. 15-03-2024 నుండి 23-03-2024 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.

7. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

8. నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపరచని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.

9. G.O.Ms.No.18, WDCW&DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త /మిని అంగన్వాడీ కార్యకర్త / ఆయా పోస్టుల నియామక విధానము.

VSP Anganwadis Selection Process 2024

  • 10 వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత :: 50 Marks
  • ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ECE వర్కర్ గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు) :: 05 Marks
  • (a) వితంతువులకు :: 05 marks
  • (b) మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు :: 05
  • పూర్తి అనాధ లేదా క్రషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి :: 10
  • అర్హత కలిగిన వికలాంగులకు :: 05
  • మౌఖిక ఇంటర్వ్యూ :: 20
Total :: 100

అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున అభ్యర్ధులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు జతపరచవలయును. అట్లు జతపరచని యెడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

Anganwadi Workers, Helpers Salary 2024

 
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము (నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) మాత్రమే చెల్లించబడును.

అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది

 How to APPLY for Visakha Anganwadi Notification 2024


దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబంధిత శిశు అభివృద్ది పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకు గాని జిల్లా కలెక్టర్ & చైర్మన్, అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ సెలెక్షన్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.

ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ: 23.03.2024
Download the Application, Notification PDF

Previous Post Next Post